Site icon vidhaatha

సౌతాఫ్రికాని చిత్తుగా ఓడించిన టీమిండియా.. సిరీస్ స‌మం

సౌతాఫ్రికాతో మూడు టీ 20ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 వ‌ర్షం వ‌ల‌న ర‌ద్దైంది. రెండో టీ20లో సౌతాఫ్రికా జ‌ట్టు విజ‌యం సాధించింది. ఇక సిరీస్ స‌మం చేయాలంటే తప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్ లో ఇండియా మంచి విజ‌యం సాధించింది. గురువారం జరిగిన చివరి టీ20లో సమష్టిగా రాణించిన టీమిండియా 106 పరుగుల భారీ తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. సూర్య బ్యాటింగ్ మెరుపులు, కుల్దీప్ మ‌ణిక‌ట్టు మాయాజాలంతో ఇండియా మంచి విజ‌యాన్ని ద‌క్కించుకుంది. మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు మార్క్ర‌మ్. బ్యాటింగ్ కి వ‌చ్చిన భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. యశస్వి జైస్వాల్(41 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60) హాఫ్ సెంచరీతో రాణించడంతో మంచి స్కోరు ద‌క్కింది.

భార‌త బ్యాట్స్‌మెన్స్‌లో 12 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ ఔటయ్యాడు.4 పరుగుల వద్ద రింకూ సింగ్ ఔట్ అయ్యాడు. నాలుగు పరుగులు చేసిన తర్వాత జితేష్ శర్మ హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. నాలుగు పరుగులు చేసిన తర్వాత రవీంద్ర జడేజా రనౌట్ అయ్యాడు. తిలక్ వర్మ ఖాతా తెరవ‌కుండానే ఔట‌య్యాడు మహ్మద్ సిరాజ్ రెండు పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అర్ష్‌దీప్ కూడా ఖాతా తెరవకుండానే నాటౌట్‌గా నిలిచాడు. సఫారీ బౌలర్లలో కేశవ్ మహరాజ్, లిజాడ్ విలియమ్స్ రెండేసి వికెట్లు తీయగా.. నాండ్రె బర్గర్, టబ్రైజ్ షంసీ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు వచ్చిన దక్షిణాఫ్రికా జట్టు 13.5 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌట్ అయింది.. దక్షిణాఫ్రికా తరఫున కేవలం ముగ్గురు బ్యాట్స్‌మెన్ మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. డేవిడ్ మిల్లర్ 35, ఐడెన్ మార్క్రామ్ 25, డోనోవన్ ఫెరీరా 12 పరుగులు చేశారు.

కుల్దీప్ యాదవ్(5/17) స‌ఫారీ బ్యాట్స్‌మెన్స్‌గా వ‌ర‌స‌గా పెవీలియ‌న్‌కి క్యూ క‌ట్టారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్‌కు తోడుగా రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీయగా.. ముఖేష్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్ తలో వికెట్ తీసారు. ఇక ఈ మ్యాచ్‌లో సూర్య నాలుగో టీ20 సెంచర చేయ‌గా, దాంతో టీ20 క్రికెట్‌లో అత్యధిక శతకాలు నమోదు చేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ రికార్డును సూర్య సమం చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 57 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించగా.. గ్లేన్ మ్యాక్స్‌వెల్ 92 ఇన్నింగ్స్‌ల్లో నాలుగు శతకాలు నమోదు చేశాడు. రోహిత్ శర్మ 140 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను అందుకున్నాడు.

Exit mobile version