బిగ్ బాస్ సీజన్ 7 కార్యక్రమం 93వ రోజుకి చేరుకుంది. ప్రస్తుతం హౌజ్‌లో ఏడుగురు ఉండగా, వీరంతా ఫినాలే వీక్ వరకు ఉంటారా లేదంటే ఇద్దరిని ఈ వారమే ఇంటికి పంపుతారా అనే దానిపై క్లారిటీ రావలసి ఉంది. ఇక ఈ వారం నామినేషన్స్ చాలా హోరాహోరీగా సాగాయి. అమర్ దీప్, ప్రశాంత్ రెచ్చిపోయి గొడవపడ్డారు. ఇక యావర్, అర్జున్ మధ్య కూడా బాగానే ఫైట్ జరిగింది. ఈ నామినేషన్ ఎఫెక్ట్ మంగళవారం ఎపిసోడ్‌లో కనిపించింది. మంగళవారం కూడా అమర్, ప్రశాంత్ తమ గొడవ కంటిన్యూ చేశారు. ఇక ఫన్నీ టాస్క్‌లు కూడా జరిగాయి. ఆడియన్స్‌ని తమకి ఓటు వేయండి అని రిక్వెస్ట్ చేసేందుకు కొన్ని ఫన్నీ టాస్క్‌లు కూడా నిర్వహించారు బిగ్ బాస్.
మొదటి టాస్క్‌లో పార్టీ చేసుకునేందుకు సంబంధించిన వస్తువులను తీసుకుని స్విమ్మింగ్ పూల్‌లో దూకాల్సి ఉండగా, ఈ టాస్క్‌లో యావర్ గెలుపొందాడు. ఇక తర్వాత జరిగిన జంపింగ్ టాస్క్‌లో శోభా శెట్టి విన్నర్‌గా నిలిచింది.ఈ రెండింట్లోను శివాజి చివరలో ఓడిపోయాడు. అయితే గెలుపొందిన వారు తమకి ఓట్లు వేసి గెలిపించాలంటూ రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ బిగ్ బాస్ ఓ చిన్న ట్విస్ట్ ఇస్తూ ఒక్కరికే ఛాన్స్ ఉంటుంది. అదెవరో ఇంటి సభ్యులు డిసైడ్ చేస్తారని అన్నాడు. దీంతో అమర్ దీప్, ప్రియాంక, అర్జున్ లు శోభాకి ఓటు వేయడంతో ఆమె ఆ ఛాన్స్ దక్కించుకుంది. ఇక తాను కష్టపడి ఈ స్థానానికి చేరుకున్నట్టు చెప్పిన శోభ తొలి లేడీ టైటిల్ విన్నర్‌గా నిలవాలనుకుంటున్నట్టు చెప్పింది. టైటిల్ విన్నర్ ద్వారా వచ్చే అమౌంట్ తనకు చాలా ముఖ్యమని, తన లైఫ్‌కి ఎంతో అవసరం అని కూడా పేర్కొంది.
ఇక ప్రియాంక, అమర్ దీప్, శోభా శెట్టి సరదాగా ఆడుకునే సమయంలో బొమ్మతో ప్రియాంక గట్టిగా కొట్టింది. అది అమర్ ముక్కుకి తగిలింది. దీంతో అమర్ దీప్ ఆ బొమ్మని విసిరేసి కోపంతో వెళ్లిపోయాడు. ఈ సమయంలో ముగ్గురి మధ్య చిన్నపాటి డిస్కషన్ నడిచింది. అయితే అంతకముందు శివాజీ, ప్రశాంత్ గురించి అమర్ దీప్, ప్రియాంక, శోభా శెట్టిలు ముచ్చటించగా, కొద్ది సేపటికే గొడవ జరిగింది. మరి ఈ సీరియల్ బ్యాచ్ తిరిగి కలుస్తుందా లేకుంటే ఎడమొహం పెడమొహం అన్నట్టుగా ఉంటారా అనేది చూడాల్సి ఉంది.