Site icon vidhaatha

వామ్మో.. తెలుగు సినిమాల‌పై జ‌ప‌నీయుల‌కి ఇంత పిచ్చి పెరిగిపోతుందేంటి.. ఆర్ఆర్ఆర్ కోసం ఏకంగా..!

తెలుగు సినిమా చరిత్ర‌ని తిర‌గ‌రాసిన బాహుబ‌లి చిత్రం మ‌న దేశంలోనే కాకుండా విదేశాల‌లో సైతం ఎంతో మందిని అల‌రించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాని జ‌ప‌నీస్ ఎంతో ఇష్ట‌ప‌డ్డారు. ఈ మూవీ రిలీజ్ త‌ర్వాత మ‌న తెలుగు సినిమాలని జ‌ప‌నీయులు బాగా ఆద‌రిస్తున్నారు. కొన్ని నెల‌ల క్రితం విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించిన ఆర్ఆర్ఆర్ సినిమాపై అయితే అమిత‌మైన ప్రేమ‌ని చూపిస్తున్నారు. ఈ సినిమాలోని పాట‌ల‌కి డ్యాన్స్‌లు చేయ‌డం, ఆ చిత్రంలోని హీరోల‌పై ఎంతో ప్రేమ‌ని చూపించ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాపై జప‌నీయులు చూపించిన ప్రేమ‌ని చూసి అంద‌రు షాక్ అవుతున్నారు. వారు చేసిన ప‌ని ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా కూడా మారింది.

ఆర్ఆర్ఆర్ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. గతంలో ఏ భారతీయ సినిమా కూడా అందుకోని గుర్తింపు ఈ మూవీ తెచ్చుకుంది అంటే అతిశ‌యోక్తి కాదు. ఈ సినిమాని తెలుగు ఆడియ‌న్స్‌, ఇండియ‌న్ ప్రేక్ష‌కులు క‌న్నా కూడా జ‌పాన్ దేశ‌స్తులు చాలా పెద్ద హిట్ చేశారు. అక్క‌డ ఈ చిత్రం ఏకంగా 365 రోజులు ఆడి ఇంకా స్ట్రాంగ్ క‌లెక్షన్స్‌తో దూసుకెళుతుంది. మ‌న తెలుగు సినిమాల‌పై వారు ఇంత ప్రేమ చూపిస్తుండ‌డం చాలా ఆశ్చ‌ర్యంగా ఉంది. అయితే ఇంతటితో ఆగ‌లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాపై ఉన్న పిచ్చి ప్రేమ‌తో ఇద్ద‌రు జపాన్ అమ్మాయిలు ఏకంగా ఇండియాకి వ‌చ్చేశారు.

ఆర్ఆర్ఆర్ సినిమా షూట్ చేసిన లొకేష‌న్‌ని క‌నిపెట్టి అక్క‌డికి వెళ్లి ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌లా ఆ ప్ర‌దేశాల‌లో తిరుగుతూ వీడియోలు తీసుకున్నారు. ఆ వీడియోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా, అవి తెగ వైర‌ల్ అయ్యాయి. అంతేకాదు వాటిని ఆర్ఆర్ఆర్ టీం త‌న ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేసింది. జ‌న‌పీస్ చూపిస్తున్న ప్రేమ‌కి ఆర్ఆర్ఆర్ టీం అయితే ఫిదా అయింది. త‌మ చిత్రంపై ఇంత ప్రేమ క‌న‌బ‌రిచినందుకు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు కూడా తెలియ‌జేసింది. ఇక ఆర్ఆర్ఆర్ అనే చిత్రం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా మూవీగా రూపొంద‌గా, ఇందులో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో, ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర‌లో కనిపించి క‌నువిందు చేశారు

Exit mobile version