దర్శక ధీరుడు రాజమౌళి మన హీరోలని ఒక్కొక్కరిగా పాన్ ఇండియా హీరోలుగా మార్చేస్తున్నారు. బాహుబలి సినిమాతో ప్రభాస్‌కి ఎనలేని క్రేజ్ దక్కింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ అన్ని పెద్ద బడ్జెట్ చిత్రాలే చేస్తూ హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా హీరోలుగా మారారు. వీరిద్దరు కూడా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని రెండు పార్ట్‌లుగా రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. భారీ స్కేల్‌లో మూవీ రూపొందుతుంది.
మరోవైపు ఎన్టీఆర్ బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2 చిత్రంతో ఎంట్రీ ఇస్తున్నారు. తారక్ తొలిసారి బాలీవుడ్ లోచేస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై అభిమానుల్లో ఆసక్తి చాలా ఉంది.ఈ సినిమా తర్వాత మరో బాలీవుడ్ మూవీ కూడా చేయనున్నట్టు సమాచారం. నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చి నటనతో, డ్యాన్స్ స్కిల్స్ తో ఇక్కడ అదరగొట్టిన జూనియర్ బాలీవుడ్‌లోను దుమ్ము రేపడం ఖాయం. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ సినిమాలకి యమ క్రేజ్ పెరిగింది.ఎన్టీఆర్ నటించిన సినిమాలన్ని హిందీలో డబ్ అవుతూ బుల్లితెరపై సందడి చేస్తున్నాయి. జూనియర్ నటించిన అశోక్ చిత్రం ఇక్కడ ఫ్లాప్ కాగా, నార్త్‌లో మాత్రం అద్భుతమైన రేటింగ్ తెచ్చుకుంది.
ఇక ఊసరవెల్లి, బాద్షా, అల్లరి రాముడు, బృందావనం లాంటి చిత్రాలు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎన్టీఆర్ కి క్రేజ్ తెచ్చిపెట్టాయి. అక్కడి వారికి మరింత దగ్గర చేశాయి. అశోక్ సినిమాతో నార్త్ లో బుల్లితెరపై ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎన్టీఆర్ బాగా కనెక్ట్ అయ్యాడని సదరు డిస్ట్రిబ్యూటర్ తెలిపారు. ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ నటిస్తున్న దేవర కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, బీహార్ లాంటి ప్రాంతాల్లో 400 పైగా థియేటర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమాతో ఎలాంటి చరిత్ర సృష్టిస్తాడో చూడాలి.