చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వైవాహిక జీవితం ఏ మాత్రం సజావుగా సాగడం లేదు. మొదట శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీజ ఆ తర్వాత అతని నుండి విడిపోయి కళ్యాణ్ దేవ్‌ని వివాహం చేసుకుంది. అతనితో కూడా ఈ అమ్మడు ఎక్కువ కాలం సంసారం చేయలేకపోయింది. కొన్నాళ్లుగా కళ్యాణ్ దేవ్‌కి దూరంగా ఉంటుందని, అతనికి విడాకులు ఇచ్చిందని కూడా ప్రచారాలు సాగుతున్నా దీనిపై అఫీషియల్ ప్రకటన చేయలేదు. ఇటీవల కళ్యాణ్ దేవ్ మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఎలాంటి ఈవెంట్స్‌లో కూడా కనిపించడం లేదు. దీంతో వారు డివర్స్ తీసుకున్నారని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్.
శ్రీజ నుండి దూరంగా ఉంటున్న కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు సందడి చేస్తున్నాడు. తన కూతురితో కలిసి దిగిన పిక్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేస్తూ ఉండే కళ్యాణ్ ..తాజాగా తమ కుటుంబంలోని ఒక శుభకరమైన వార్తను అభిమానులతో షేర్ చేస్కున్నారు. తన సోదరి ఐశ్వర్య లంక సీమంతం ఫోటోలను షేర్ చేసి, కుటుంబం పెరుగుతోందని కామెంట్ చేశాడు. సోదరి, బావగారితో పాటు కుటుంబంతో కలిసి ఉన్న పిక్స్ షేర్ చేశాడు కళ్యాణ్ దేవ్. ప్రస్తుతం ఈ పిక్స్ తెగ ఆకట్టుకుంటున్నాయి. కళ్యాణ్ దేవ్ కూడా త్వరలోనే ఓ ఇంటివాడవ్వాలని, అందరికి శుభవార్త చెప్పాలని పలువురు అభిమానులు ఇన్ స్టా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
కళ్యాణ్ దేవ్ తండ్రి కెప్టెన్ కిషన్ వ్యాపారవేత్త కాగా, ప్రస్తుతం తండ్రి వ్యాపారాలను కళ్యాణ్ దేవ్ నిర్వహిస్తున్నారని టాక్ వినిపిస్తుంది.మెగా ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన తర్వాత కళ్యాణ్ దేవ్ హీరోగా కూడా ప్రేక్షకులని పలకరించాడు. సూపర్ మచ్చి- విజేత చిత్రాల తర్వాత సినీరంగంలో అతడు కనిపించలేదు. ఒకట్రెండు సినిమాలు చేసినా వాటి గురించి అంతగా ప్రచారం దక్కకపోవడం, వాటికి ప్రేక్షకుల నుండి కూడా పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో అతను సైలెంట్ అయిపోయాడు. మరి సినీ హీరోగా తన కెరీర్ గురించి కళ్యాణ్ దేవ్ ఆలోచన ఏమిటన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.