ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సందడి నెలకొంది. ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. రీసెంట్‌గా వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి జంట అట్టహాసంగా ఇటలీ వేదికగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ హీరోయిన్ కూడా పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైంది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దమ్ము చిత్రంలో కథానాయికగా నటించిన కార్తీక నైర్ ఇప్పుడు ఏడడుగులు వేసేందుకు సిద్ధమైంది. కార్తీక అలనాటి అందాత తార రాధ ముద్దుల కూతురు. 80వ దశకంలో రాధ టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది. మెగాస్టార్ చిరంజీవి సరసన అత్యధిక చిత్రాల్లో నటించిన రాధ గ్లామర్ హీరోయిన్ గా, స్టార్ బ్యూటీగా ఇండస్ట్రీని షేక్ చేసింది. అయితే ఆమె కూతుళ్లు మాత్రం అంతగా రాణించలేకపోయారు.
టాలీవుడ్ లో కార్తీక నాగ చైతన్య జోష్ చిత్రంతో పరిచయం కాగా, అనంతరం దమ్ము చేసింది. ఈ రెండు చిత్రాలు ఫ్లాప్ కావడంతో కార్తిక కెరియర్ సజావుగా సాగలేదు. దీంతో ఆమె బిజినెస్‌పై దృష్టి పెట్టింది. అయితే ఇప్పుడు కార్తీకకి పెళ్లీడు రావడంతో కొన్ని వారాల క్రితం రోహిత్ మేనన్ తో నిశ్చితార్థం జరుపుకుంది. నిశ్చితార్థం రోజు కార్తీక ఓ వ్యక్తిని హగ్ చేసుకుని ఉన్న పిక్ ని షేర్ చేయగా, అందులో ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. దీంతో ఆమె ఎవరిని చేసుకుంటుందా అని అందరిలో కొంత సస్పెన్స్ నెలకొంది. దీనికి ఎట్టకేలకి తెరదించింది. తన కి కాబోయే భర్తని అభిమానులకు పరిచయం చేసింది. కాబోయే భర్త రోహిత్ మేనన్‌తో సన్నిహితంగా దిగిన ఫొటోలు షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేసింది. ఆ ఫొటోలకి కామెంట్‌గా.. నిన్ను కలవడం డెస్టినీ ప్రకారం జరిగింది. నీతో ప్రేమలో పడడం మ్యాజిక్.. నీతో జీవితాన్ని పంచుకునేందుకు కౌంట్ డౌన్ ప్రారంభించా అంటూ కాస్త రొమాంటిక్ టచ్ ఇచ్చింది. దీంతో అందరు ఈ అమ్మడిది లవ్ మ్యారేజా అని ముచ్చటించుకుంటున్నారు.
ఇది చూసిన వారందరు కూడా ఈడు జోడు బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కార్తీక పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది అనే దానిపై క్లారిటీ రావలసి ఉంది. అయితే రాధ ఇప్పటికే తన కూతురి వెడ్డింగ్ కార్డ్స్ సెలబ్రిటీలకి అందిస్తుండడం మనం చూస్తున్నాం. రీసెంట్‌గా రాఘవేంద్రరావు ఇంటికి వెళ్లి కార్డ్ అందించింది.