మెగాస్టార్ చిరంజీవి ఎన్నో ఏళ్లుగా వెండితెరపై అద్బుతాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. చిరు డ్యాన్సుకు, మేనరిజానికి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికీ ఆయనను అన్నయ్యా, అన్నయ్యా అని పిలుచుకునే అభిమానులు.. చిరు చిత్రాల కోసం తెగ ఆసక్తిగా వేచి చూసే వారు లేకపోలేదు. వయస్సు పెరిగిన కూడా ఎంతో ఉత్సాహంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నారు. ఖైదీ నెం 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తున్నారు. . ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూ మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలానే యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన పర్సనల్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటూ వస్తున్నారు.
చిరంజీవిని ఆ నాటి తరం వారే కాదు, ఈ నాటి తరం వారు కూడా ఎంతగానో ఇష్టపడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత..చిరంజీవి నా డైహార్డ్ ఫ్యాన్ అంటూ ఆసక్తికర కామెంట్ చేసి వార్తలలో నిలిచింది. ప్రస్తుతం కవిత ఎన్నికల ప్రచారాలలో బిజీగా ఉంది. అడపాదడపా సోషల్ మీడియాలో కూడా నెటిజన్స్‌తో ముచ్చటిస్తూ వారికి అనేక విషయాలు తెలియజేస్తుంది. అయితే తాజాగా కవిత #AskKavitha అంటూ ఫాలోవర్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది. ఓ నెటిజన్.. ‘చిరంజీవి అభిమానిగా ఆయన గురించి ఏమైనా చెప్పండి’ అని అడగ్గా, దానికి ఆమె డై హార్డ్ ఫ్యాన్ అని సమాధానం ఇచ్చింది.
ఇక మరో నెటిజన్ మీ ఫేవరేట్ హీరో ఎవరు మేడమ్ అని అడగ్గా.. ‘మెగాస్టార్ చిరంజీవి ఆల్వేస్.. నెక్ట్స్ అల్లు అర్జున్.. తగ్గేదేలే’ అంటూ జిఫ్ ఇమేజ్‌ను షేర్ చేసింది. మొత్తానికి మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలే కవిత ఫేవరేట్ హీరోస్ కావడంతో మెగా ఫ్‌యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. గతంలో పలు ఇంటర్వ్యూల్లోనూ ‘మీకు బాగా ఇష్టమైన నటుడు’ ఎవరు అని కవితని ప్రశ్నించగా, ‘చిరంజీవి ఆల్వేస్’ అని సమాధానమిచ్చారు. అలాగే ఖైదీ 150 సినిమాకు ముందు ‘ చిరంజీవి150 సినిమా కోసం వేచి చూస్తున్నాను. ఒకసారి అభిమాని అయ్యాక ఎప్పటికీ అభిమానిగానే ఉంటాం’ అని కవిత చెప్పుకురావడం మనం చూశాం. మొత్తానికి కవిత సమాధానానికి చిరు ఏమైన రియాక్ట్ అవుతారా లేదా అనేది చూడాలి.