Site icon vidhaatha

అభిమాని స‌హ‌నాన్ని ప‌రీక్షించిన కీర్తి సురేష్‌.. చివ‌రికి క్ష‌మాప‌ణలు చెప్పిందిగా..!

మ‌హాన‌టి సినిమాతో జాతీయ స్థాయిలో క్రేజ్ అంద‌కున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌. కెరీర్‌లో ఎన్నో ప్ర‌యోగాలు చేస్తూ స్టార్ హీరోయిన్ స్టేట‌స్ అందుకుంది. సెలక్టివ్ పాత్రలు ఎంచుకుంటూ డిఫరెంట్ సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్ దసరాలో తన అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఈ అమ్మ‌డు హీరోయిన్ పాత్ర‌లే కాదు, చెల్లి పాత్ర‌లు పోషిస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. కీర్తి సురేష్‌ త్వరలోనే పెళ్లి చేసుకుంటోందనే వార్త కొద్ది రోజుల క్రితం తెగ‌ వైరల్ అయింది. అదేం లేదు..అవ‌న్నీ అవాస్త‌వాలే అంటూ కీర్తి సురేష్ రెడ్డి తండ్రి స్పందించారు. కీర్తి సురేష్‌కి రోజు రోజుకి విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డుతుంది. కేవ‌లం తెలుగులోనే కాక ఇత‌ర భాష‌ల‌లోను ఆమెకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది.

చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెర ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ మొద‌ట్లో మలయాళం చిత్రాలతో అలరించింది. తర్వాత తమిళంలో హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకొని అనంత‌రం నేను శైలజ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. కీర్తి సురేష్ సినిమాల‌తోనే కాక సోష‌ల్ మీడియాలోను తెగ సంద‌డి చేస్తూ ఉంటుంది. ఇక ఆమె డైహార్ట్ ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ఈ భామ‌కి ప‌లు సందేశాలు పంపుతూనే ఉంటారు. కీర్తి కొన్నింటికి స్పందిస్తూ ఉంటుంది. మ‌రి కొన్నింటిని నెగ్లెక్ట్ చేస్తుంది. కృష్ణ అనే వీరాభిమాని కీర్తికి ట్వీటర్ లో 233 లేఖలు రాసి తన అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నాడు. ర్తి సురేష్ ఎప్పుడు త‌న లేఖ‌కి ఎప్పుడు రిప్లై ఇస్తుందా? అని ఎదురుచూసారు.

మొత్తానికి 234వ సారి రాసిన లేఖ‌కి కీర్తి రిప్లై ఇచ్చింది. అయితే, ఇంత ఆలస్యంగా రిప్లై ఇచ్చినందుకు క్షమాపణలు కోరింది. మీలాంటి అభిమానులు నాకు ఉండ‌డం నా అదృష్టం అని కూడా చెప్పుకొచ్చింది. ఇక ఆ నెంబర్ తనకు ఫాంటసీ నెంబర్ అని కూడా చెప్పింది. మొత్తానికి తన అభిమానిని ఖుషీ చేసి ఇప్పుడు వార్త‌ల‌లో కూడా నిలిచింది. ఇక కీర్తి సురేష్ సినిమాల విష‌యానికి వ‌స్తే ఈ భామ VD18, అక్క, రివాల్వర్ రీటా, సైరెన్ వంటి చిత్రాల్లో నటిస్తోంది. బాలీవుడ్ లో రాధికా ఆప్టేతో చేయ‌నున్న వెబ్ సిరీస్‌తో ఈ అమ్మ‌డి క్రేజ్ పీక్స్ కి వెళ్ల‌డం ఖాయం అని అంటున్నారు. 

Exit mobile version