మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న కీర్తి సురేష్ కి మహానటి చిత్రం మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇందులో కీర్తి సురేష్ నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కడమే కాకుండా నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది.హీరోయిన్ గా సత్తా చాటుతున్న సమయంలో కీర్తి చెల్లెలు పాత్ర కూడా పోషించి అందరిని ఆశ్చర్యపరచింది. భోళా శంకర్ చిత్రంలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్రను పోషించింది. ప్రస్తుతం సౌత్‌లో సత్తా చాటుతున్న ఈ ముద్దుగుమ్మ వచ్చే ఏడాది బాలీవుడ్‌లోను తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైందట.
అయితే కీర్తి సురేష్ రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో తాను చదువుకున్న రోజుల్లో ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చింది. నేను, నా స్నేహితురాలు నడుచుకుంటూ కాలేజీకి వెళ్తున్న సమయంలో ఓ తాగుబోతు వచ్చి నాపై చేయి వేశాడు.ఆ సమయంలో నేను ఆ తాగుబోతు చెంప చెళ్లుమనిపించానని కీర్తి సురేష్ తెలిపింది. నేను చేసిన పనికి అక్కడున్న వారంతా మెచ్చుకున్నారని.. ఈ ఘటన తనని ధైర్యవంతురాలుగా చేసిందని కీర్తి సురేష్ స్పష్టం చేసింది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ సైతం కీర్తి సురేష్ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.
సీనియర్ హీరోయిన్ మేనక కూతురు అయితన కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆమె తన తల్లి వారసత్వాన్ని నిలబెట్టే స్టార్‌గా ఎదిగింది. మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ కెరీర్ కాస్త గాడి తప్పిందని చెప్పవచ్చు. ఆ సినిమా తర్వాత ఆమె చేసిన మూవీలేవి సరైన విజయాన్ని దక్కించుకోకపోవడంతో నిరాశలో ఉండిపోయింది. అప్పుడు మహేష్ బాబు సరసన చేసిన సర్కారు వారి పాట కీర్తి సురేష్ కెరీర్‌ను మళ్లీ గాడిలో పెట్టిందని చెప్పవచ్చు. ఆ తర్వాత దసరా సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. ఇలా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న కీర్తి సోషల్ మీడియాలో కూడా తెగ సందడి చేస్తుంటుంది.