Site icon vidhaatha

ఖాన్ త్ర‌యానికి ప్ర‌భాస్ టెన్ష‌న్.. ముగ్గురికి చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాడుగా..!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ క్రేజ్ అంత‌కంత పెరుగుతూ పోతుంది.బాహుబ‌లి ఫ్రాంచైజీలతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ ఆ త‌ర్వాత మూడు వ‌రుస ఫ్లాపుల‌తో నిరాశ‌ప‌రిచిన రీసెంట్‌గా స‌లార్ చిత్రంతో భారీ హిట్ కొట్టాడు. ఇప్పుడు ఈ చిత్రం దేశ వ్యాప్తంగా క‌లెక్ష‌న్ల సునామి సృష్టిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాకి ఏకంగా రూ.600 కోట్ల వ‌సూళ్లు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.అయితే ఒక‌ప్పుడు ఖాన్ త్ర‌యానికి మన హీరోల నుండి ఎలాంటి పోటీ ఉండేది కాదు. కాని ఇప్పుడు ముగ్గురు హీరోల‌కి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు డార్లింగ్‌. ఖాన్ త్ర‌యం అయిన‌ షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లకు ప్రభాస్ సలార్ సినిమాతో చుక్క‌లు చూపిస్తున్నాడు.

స‌లార్ చిత్రం మొదటి రోజే 75 కోట్ల భారీ ఓపెనింగ్ కలక్షన్లను రాబట్టి ఖాన్ త్రయానికి సాధ్యం కానీ ఒక భారీ ఓపెనింగ్స్ ని సెట్ చేశాడు. నార్త్ సినిమాలే గొప్ప అని చెప్పుకునే ఖాన్ త్రయానికి ఇప్పుడు ఈ రికార్డ్ కంటిపై కునుకు లేకుండా చేస్తుంద‌నే చెప్పాలి. బాలీవుడ్‌కి స‌రైన మొగుడు ప్ర‌భాస్ అంటూ కొంద‌రు నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. ఆ మ‌ధ్య ప్ర‌భాస్ క్రేజ్ విపరీతంగా పెరుగుతుండ‌డంతో బాలీవుడ్‌లో డార్లింగ్‌పై నెగెటివ్ ప్ర‌చారం ఎక్కువ చేసిన‌ట్టు కూడా ప్ర‌చారాలు సాగాయి. అయితే ప్ర‌భాస్ క్రేజ్ తగ్గించేందుకు ఎవరెన్ని ప్ర‌య‌త్నాలు చేసిన అవి ఏ మాత్రం వ‌ర్క‌వుట్ కాలేద‌నే చెప్పాలి.

క్రిస్మ‌స్ కానుక‌గా, ప్రభాస్ సలార్ తో పాటు షారూఖ్ ఖాన్ డంకీ కూడా రిలీజ్ అయింది. అయితే డంకీ చిత్రం స‌లార్ ముందు చిన్న‌బోయింది. సలార్ చిత్రం నార్త్ లో కూడా భారీ వసూళ్లను సాధిస్తుంది.ఇక ఇప్పటికి కూడా ఈ సినిమా రోజుకి 10 నుంచి 15 కోట్ల కలక్షన్లను రాబడుతూ బాలీవుడ్ లో 100 కోట్లకు పైన కలక్షన్లు రాబట్టిన ఒక సౌత్ సినిమాగా మంచి గుర్తింపు ద‌క్కించుకుంద‌నే చెప్పాలి. ఈ ఏడాది ప్ర‌భాస్ క‌ల్కి చిత్రంతో ప‌ల‌క‌రించ‌నున్నాడు. ఈ మూవీ ఇంకెన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తుందా అని ప్ర‌తి ఒక్క‌రు ముచ్చ‌టించుకుంటున్నారు. మ‌రోవైపు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో కూడా ప్ర‌భాస్ ఓ చిత్రం చేస్తుండ‌గా ఈ సినిమా కూడా 2024లోనే విడుద‌ల కానుంది.

Exit mobile version