రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. క్రికెట్ చరిత్రలో ఆయన సువర్ణ అధ్యాయాలు లిఖించుకుంటూ పోతున్నారు. సచిన్ 50 సెంచరీల రికార్డ్‌ని కూడా సమం చేశాడు విరాట్. అయితే ప్రతి బ్యాట్స్‌మెన్‌కి కొన్ని మంచి డేస్, కొన్ని బ్యాడ్ డేస్ రావడం సహజం. కోహ్లీకి 2019-2022 మాత్రంలో చాలా బ్యాడ్ టైం నడిచింది.టాప్ వన్ వన్డే బ్యాట్స్‌మెన్ స్థానాన్ని కోల్పోవడం, అలానే అతని కెప్టెన్సీలో డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఓడిపోవడం, టీ 20 కెప్టెన్సీ నుండి తప్పుకున్నట్టు ప్రకటించడం, అలానే ఐపీఎల్‌లో బెంగళూరు టీంకి కెప్టెన్ గా గుడ్ బై చెప్పడం వంటివి జరిగాయి. మరోవైపు ఫామ్ లేమితో కూడా విరాట్ చాలా ఇబ్బంది పడ్డాడు. ఒకప్పుడు విరాట్ కోహ్లీ ప్రతి రెండో-మూడో మ్యాచ్‌లో సెంచరీ చేసేవాడు. కానీ, ఈ మూడేళ్లలో మాత్రం కోహ్లీ బ్యాట్ నుండి పరుగులు రావడం చాలా కష్టంగా మారింది.
అయితే ఎన్ని విమర్శలు వచ్చిన కూడా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగిన కోహ్లీ ఆసియా కప్ నుండి ఫామ్ లోకి వచ్చాడు. మైదానంలో పరుగుల వర్షం కురిపిస్తూ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. 2022 టీ20 ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై సెంచరీ చేయడం ద్వారా ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ 2023 సంవత్సరాన్ని తనకి మెమోరబుల్‌గా మార్చుకున్నాడు. ఈ ఏడాది కోహ్లీ ప్రపంచ కప్‌లో 2000 కంటే ఎక్కువ పరుగులు, 8 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు, అత్యధిక పరుగులతో సహా అనేక ప్రత్యేక రికార్డులను నెలకొల్పాడు. ఈ ఏడాదిలో కోహ్లీ 2048 పరుగులు చేశాడు.ఇందులో 8 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మొత్తం 36 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ 2048 పరుగులు చేశాడు. ఈ సమయంలో కోహ్లీ సగటు 66.06గా ఉంది.
దక్షిణాఫ్రికాపై 2023 చివరి ఇన్నింగ్స్‌లో 76 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ప్రపంచకప్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై వన్డే ఫార్మాట్‌లో 50వ సెంచరీ సాధించిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా నిలిచాడు. ఒకే ప్రపంచకప్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు కోహ్లీ. ఏకంగా 765 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 639 పరుగులు చేశాడు. ఇలా అనేక రికార్డులని తన ఖాతాలో వేసుకొని సరికొత్త చరిత్ర సృష్టించాడు.