ఉప్పెన సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది అందాల ముద్దుగుమ్మ బేబమ్మ. తొలి సినిమాలోనే తన క్యూట్‌నెస్‌తో పాటు అభినయంతో తెగ ఆకట్టుకుంది. ఉప్పెన తర్వాత కృతికి వరుస ఆఫర్స్ వచ్చాయి. నానితో శ్యామ్ సింగరాయ్, బంగర్రాజు చిత్రాలలో నటించి వరుస విజయాలు అందుకొని భారీ క్రేజ్ తెచ్చుకుంది. అయితే బంగార్రాజు తర్వాత మళ్లీ ఆమె హిట్ ముఖమే చూడలేదు. కృతికి తెలుగులో వరుసగా నాలుగు ఫ్లాపులు పడటంతో ఆఫర్లు తగ్గిపోయాయి. ప్రస్తుతం తమిళ, మళయాళ భాషల్లో సినిమాలు చేస్తూ అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.
ఇక కృతి శెట్టికి సంబంధించి సోషల్ మీడియాలో అనేక వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తుంటాయి. ఆ మధ్య కృతి.. కోలీవుడ్ స్టార్ హీరోకు కృతిశెట్టి కోడలు కాబోతోందని ప్రచారం జరిగింది. దాంతో ఆ హీరో ఎవరు, అతని పేరేంటి? అసలు ఈ వార్త నిజమేనా? అంటూ నెటిజన్లు తెగ సెర్చ్ చేశారు.అయితే తర్వాత అది పుకారేనని తేలింది. ఇక ఇదిలా ఉంటే శర్వానంద్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతుండగా, ఇందులో కథానాయికగా కృతిని పరిశీలిస్తున్నారు. బేబీ ఆన్ బోర్డ్ అనే టైటిల్ ను ఈ చిత్రానికి పరిశీలిస్తున్నారు. చూస్తుంటే ఈ చిత్రం కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాగా తెలుస్తుంది. కృతికి మంచి పేరు వస్తుందని అంటున్నారు.
అయితే అవకాశాలు సన్నగిల్లుతున్న నేపథ్యంలో కృతి శెట్టి అందాల విందుకి తెరలేపింది . తన బౌండరీలన్నీ బ్రేక్ చేస్తుంది. హద్దులు చెరిపేస్తూ స్కిన్ షో చేస్తుంది. ఘాటు రేపే పోజులతో కుర్రాళ్లకి మైండ్ బ్లాక్ చేస్తూ అదిరిపోయే ట్రీట్ ఇస్తుంది. తాజాగా మత్యకన్యలా మారిపోయిన ఈ అందాల భామ… సముద్రంలో ఉండాల్సిన సొరచేప నేలపైకి వచ్చిందా అనేట్టుగా పోజులిచ్చి కుర్రాళ్లని థ్రిల్ చేసింది. ఈ అమ్మడు ఒంటికి రంగులు అద్దుకుని నిలబడ్డట్టుగా, తన నయాగార వొంపులు చూపిస్తూ కేక పెట్టించింది. ప్రస్తుతం కృతి క్యూట్ లుక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.