ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రంలో కథానాయికగా నటించిన కృతి సనన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. 1 నేనొక్కడినే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ భామ సినిమాలో తన నటనతో మంచి మార్కులే సంపాదించుకుంది. అయితే సినిమా ఫ్లాప్ కావడం, ఆ తర్వాత తెలుగులో చేసిన చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడడం కృతికి చాలా నిరాశ కలిగించాయి. దీంతో ఈ భామ బాలీవుడ్‌కి వెళ్లి అక్కడ వైవిధ్యమైన చిత్రాలు చేసి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇప్పటికే ఎన్నో హిందీ సినిమాలలో నటించి అద్భుతమైన క్రేజ్ ఉన్న నటి గా బాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం ఈ బ్యూటీ తన కెరియర్ ను సాగిస్తుంది. 27 జూలై 1990న న్యూఢిల్లీలో చార్టర్డ్ అకౌంటెంట్ రాహుల్ సనన్ మరియు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్ర ప్రొఫెసర్ అయిన గీతా సనన్ దంపతులకు జన్మించింది ఈ పంజాబి భామ.
2021లో మిమీ అనే కామెడీ డ్రామాలో అద్దె గర్భం తల్లి పాత్ర పోషించినందుకు కృతి సనన్ జాతీయ చలనచిత్ర అవార్డు మరియు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నారు. 2022లో హాస్యభరితమైన హార్రర్ చిత్రం భేదియా కూడా అమ్మడికి మంచి ఆదరణ దక్కేలా చేసింది. ఇకపోతే సినిమాల్లో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసే అందాల ముద్దగుమ్మ సోషల్ మీడియాలో ప్రకంపనలు పుట్టిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ హాట్‌నెస్‌కి మైమరచిపోతున్నారు. టైట్ డ్రెస్‌లో హోయలు పోతూ ఈ ముద్దుగుమ్మ చేస్తున్న అరాచకం పీక్స్‌లో ఉందని కొందరు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ హాటెస్ట్ బ్యూటీ కి సంబంధించిన వెరీ హాట్ యాంగిల్స్ లో ఉన్న ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.
మొత్తానికి కృతి సనన్ సినిమాల్లో మరియు సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ కుర్ర కారుకు మంచి కిక్ ఇస్తుంది అని చెప్పాలి.ఇక కృతి సనన్ నటనతో పాటు, తన సొంత దుస్తులను, ఫిట్‌నెస్ కంపెనీ మరియు చర్మ సంరక్షణ బ్రాండ్‌ను ప్రారంభించింది. ఆమె అనేక బ్రాండ్లు మరియు ఉత్పత్తులకు అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ కూడా నటి అన్న విషయం తెలిసిందే.