Site icon vidhaatha

కుమారి ఆంటీ బిగ్ బాస్ షోకా, లేదంటే శ్రీదేవి డ్రామా కంపెనీ షోకా.. క్లారిటీ ఇదే..!

గ‌త కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో ఒకే ఒక్క పేరు తెగ వినిపిస్తుంది. చాలా మంది ఆమె మాట తీరుని అనుకరిస్తూ సోషల్ మీడియాలో రీల్స్ చేయడంతో ఈమె ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్ వారు ఈమె ఫుడ్ స్టాల్ వద్దకు చేరుకొని అక్కడ ఎంత ధరలు ఏంటి అనే విషయాలను అడిగి తెలుసుకుంటూ ఇంటర్వ్యూ చేస్తూ ఉండ‌డంతో ఒక్క‌సారిగా ఆమె క్రేజ్ పీక్స్‌కి వెళ్లింది. ఒక్క‌సారైన ఆమె ద‌గ్గ‌ర ఫుడ్ తినాల‌ని చాలా మంది భావిస్తూ అక్క‌డికి భారీగా చేరుకుంటుండ‌డంతో ట్రాఫిక్ స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. దీంతో పోలీసులు ఫుడ్ స్టాల్ క్లోజ్ చేయించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తిరిగి యధావిధిగా తన ఫుడ్ స్టాల్ ప్రారంభించారు.

త్వ‌ర‌లో రేవంత్ రెడ్డి ఆమె ఫుడ్ స్టాల్‌ని సంద‌ర్శిస్తార‌నే ప్ర‌చారం కూడా సాగుతుంది. ఫుడ్ బిజినెస్ చేసుకుంటూ మంచి సక్సెస్ అందుకున్న కుమారి ఆంటీ గురించి గ‌త కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో అనేక వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈవిడ బిగ్ బాస్ లోకి, శ్రీదేవి డ్రామా కంపెనీలోకి రాబోతుందంటూ వార్తలు వచ్చాయి..ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెకు ఇదే ప్రశ్న ఎదురయింది.మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు కదా అంటూ ప్రశ్నించడంతో అందుకు కుమారి ఆంటీ నవ్వి మీకు ఎలా తెలుస్తున్నాయి అంటూ చెప్పుకు వచ్చారు.మాకు తెలుస్తాయి మీరు వెళ్తున్నారు అక్కడికి వెళ్లి ఏం చేస్తారు? అసలు ఎప్పుడు ఫోన్ వచ్చింది అనే ప్రశ్నలు ఎదురు కావడంతో ప్లీజ్ దయచేసి అవన్నీ అడగకండి అంటూ ఆమె స‌మాధానం దాటివేశారు.

అంటే ఈవిడ త్వ‌ర‌లో శ్రీదేవి డ్రామా కంపెనీలో సంద‌డి చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఈ షో త‌ర్వాత ఈవిడ క్రేజ్ మ‌రింత పీక్స్‌కి వెళుతుంద‌ని స‌మాచారం. చూస్తుంటే వ‌చ్చే సీజ‌న్ లో బిగ్ బాస్ షోలో పాల్గొన్నా కూడా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని కొంద‌రు చెప్పుకువ‌స్తున్నారు. ఇక రీసెంట్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన ఆమె ఏపీ రాజకీయాలపైనా మాట్లాడారు. ఏపీలో మీకు ఇష్టమైన నాయకుడు ఎవరని..రిపోర్టర్ ప్రశ్నించగా.. చంద్రబాబు నాయుడు అని ఆమె సమాధానం చెప్పారు. తనకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచీ చంద్రబాబు నాయుడుకే ఓటు వేసినట్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా తెగ చ‌ర్చ న‌డుస్తుంది. టీడీపీ అభిమాని అయినా.. ఆమె జగనన్న ఇల్లు ఇచ్చాడని.. అదీ తమ గొప్ప తనమని వైసీపీ నాయ‌కులు అంటున్నారు.

Exit mobile version