గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కుర్చీతాత అలియాసా పాషా పేరు తెగ నానుతుంది. కుర్చీ మడతపెట్టి డైలాగ్ ని ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఈ డైలాగ్, ఆ తాత బాగా పాపులార్ అయింది.ఇక ఇప్పుడు ఇదే డైలాగ్ తో ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సాంగ్ చేయడంతో తాత మరింత వైరల్ అవుతున్నాడు. ఆ తాత ఇంటర్వ్యూ కోసం పలు యూట్యూబ్ ఛానల్స్ క్యూలు కడుతున్నాయి. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ సాంగ్ పై స్పందించాడు కుర్చీ తాత. నా కుర్చీ డైలాగ్ తో పాట చేసి, డ్యాన్స్ చేసినందుకు సంతోషంగా ఉంది. గొప్ప నటుడు అయిన మహేష్ బాబు నా డైలాగ్ కి పాట చేసాడంటే ఆనందంగా అంది అని అన్నారు పాషా.
గుంటూరు కారం మూవీ యూనిట్ కుర్చీ తాతకు, ఇందులో DJ మిక్స్ చేసిన హరీష్ కు కొంత అమౌంట్ ఇచ్చారని సమాచారం. అయితే కుర్చీ తాతకి గుంటూరు కారం సినిమాలో నటించే అవకాశం కూడా వచ్చిందట. దానిపై స్పందించిన ఈ తాత.. గుంటూరు కారం సినిమాలో తనకు ఛాన్స్ ఇచ్చారని.. కానీ అదే సమయంలో తాను కనపడకుండా పోవడంతో.. అవకాశం కోల్పోయినట్టు చెప్పుకొచ్చారు. అయితే త్రివిక్రమ్ తదుపరి చిత్రంలో మాత్రం తనకు అవకాశం దక్కినట్టు మాత్రం తాత పేర్కొన్నారు. గురూజీ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున సినిమాలో తాను కచ్చితంగా నటిస్తానని, వారు ఆ అవకాశం తప్పక ఇస్తారని ఆశిస్తున్నాను అన్నాడు.
నిజంగా కుర్చీ తాతకి అవకాశం ఇవ్వాలని అతడు ఫుల్ఫేమస్ కాబట్టి ఆయనని మెల్లగా సినిమాలలోకి కూడా తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. మరి కుర్చీ తాతకు నిజంగా సినిమాల్లో ఛాన్స్ లు వస్తాయో లేదా అనేది చూడాల్సి ఉంది. ఇక త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా చేస్తున్న గుంటూరు కారం చిత్రాన్ని జనవరి 12న విడుదల చేయాలని చూస్తున్నారు. గత కొద్ది రోజులుగా మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.