గత పదమూడు వారాలుగా ప్రతి సోమ, మంగళవారాలలో నామినేషన్ రచ్చ ఏ రేంజ్ లో సాగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ బిగ్ బాస్ హౌజ్ హోరెత్తిపోయేలా చేస్తున్నారు. అయితే ఈ సోమవారం బిగ్ బాస్ సీజన్ 7 చివరి నామినేషన్ కాగా, ఈ నామినేషన్స్ చాలా వాడివేడిగా సాగాయి. ఈ ఆదివారం గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ కావడంతో హౌజ్‌లో ఏడుగురు ఉన్నారు. అంటే ఈ వారం ఇద్దరిని ఎలిమినేట్ చేయనున్నట్టు తెలుస్తుంది. 14వ వారం నామినేషన్స్ ద్వారా ఇద్దరు ఇంటికి వెళితే ఫైనల్స్ కు కేవలం ఐదుగురు మాత్రమే వెళుతుండడం ప్రతి సీజన్‌లో చూస్తున్నాం.
ఇక ఈ వారం నామినేషన్ ప్రక్రియ విషయానికి వస్తే.. ప్రతి కంటెస్టెంట్ ఇద్దరి నామినేట్ చేయాల్సి ఉంది. గెట్ అవుట్ అనే గేమ్ లో నామినేట్ చేసే కంటెస్టెంట్ ఫొటో ను టైల్ పై ప్రింట్ చేసి బ్రేక్ చేయాలని బిగ్ బాస్ తెలియజేస్తారు. ఇక అర్జున్ ఫినాలే అస్త్రను దక్కించుకోవడంతో అతనిని నామినేట్ చేసే అవకాశం లేదు. నామినేషన్ ప్రక్రియను తొలుత యావర్ ప్రారంభించగా, ముందుగా యావర్ – శోభా శెట్టి, ప్రియాంక ను నామినేట్ చేశారు. ఆ తర్వాత శోభాశెట్టి – యావర్ ను నామినేట్ చేయగా, యావర్ కామెంట్లపై శోభా డిఫెన్స్ చేసింది. అనంతరం శివాజీ ని నామినేట్ చేసింది శోభా శెట్టి. ఇక ఆ తర్వాత వచ్చిన పల్లవి ప్రశాంత్ – అమర్ దీప్, శోభా శెట్టిని.. అర్జున్ – అమర్ దీప్, యావర్ ను నామినేట్ చేశారు.
యావర్ వల్ల విడిపించుకో రాజా గేమ్ లో తనకు నష్టం జరిగిందని అర్జున్ చెప్పగా, ఈ క్రమంలో ఇద్దరి మధ్య చాలా సేపు డిస్కషన్ జరిగింది.ఇక ప్రియాంక అమర్ దీప్ ను నామినేట్ చేస్తూ హర్ట్ అయ్యేలా మాట్లాడావని చెప్పింది, అలానే యావర్‌ని కూడా నామినేట్ చేసింది. ఇక శివాజీ ప్రియాంకను నామినేట్ చేశారు. దాంతో అమర్ దీప్ ను కూడా నామినేట్ చేశారు.ఇక ఆ తర్వాత అమర్ దీప్ పల్లవి ప్రశాంత్ ను నామినేట్ చేయడంతో హౌజ్లో మాటల యుద్దం జరిగింది. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చారు. ఈ క్రమంలో రైతు బిడ్డా చాలా ఎమోషనల్ అయ్యారు. అమర్ వల్ల తానే మోసపోయానని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. అమర్ దీప్ తర్వాతి నామినేషన్‌గా యావర్ ను నామినేట్ చేసి రీజన్ తెలిపారు. మొత్తానికి సోమవారం నామినేషన్ రచ్చతో హౌజ్ వేడెక్కింది. మరి మంగళవారం కూడా నామినేషన్స్ ప్రక్రియ జరుగుతుందా లేదా అనేది చూడాలి.