Site icon vidhaatha

వ‌రుణ్ తేజ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకోవ‌డం గురించి తొలిసారి ఓపెన్ అయిన లావ‌ణ్య త్రిపాఠి

ప్ర‌స్తుతం టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో పెళ్లిళ్ల సంద‌డి నెలకొంది. న‌వంబ‌ర్ 1న‌ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల రాక్షసి లావణ్య అట్ట‌హాసంగా పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి ఇటలీలో అంగరంగ వైభవంగా జరిగింది. మెగా ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ కూడా ఈ వేడుక‌లో సంద‌డి చేసింది. నవంబ‌ర్ 5న సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో రిసెప్ష‌న్ ఏర్పాటు చేసుకుంది ఈ జంట‌. ఇక డెహ్రాడూన్‌లో కూడా ఓ రిసెప్ష‌న్ ఏర్పాటు చేసుకున్న‌ట్టు స‌మాచారం. మరోవైపు నూత‌న జంట హ‌నీమూన్ కూడా ప్లాన్ చేసుకున్న‌ట్టు టాక్ వినిపిస్తుంది. ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ జంట.. ఇండోనేషియాలోని బాలి నగరంకి హ‌నీమూన్‌గా వెళ్లాల‌ని అనుకుంటున్నార‌ట‌.

త్వరలోనే వీరు బాలీకి వెళ్ళబోతున్నట్లు ఓ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అక్కడే వీరు తమ హానీమూన్ ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేశారని తెలుస్తోంది. మాల్దీవులు క‌న్నా కూడా బాలి వాతావ‌ర‌ణం చాలా బాగుంటుంద‌ని భావించిన జంట అక్క‌డికి ప్లాన్ చేసుకున్న‌ట్టు టాక్ వినిపిస్తుంది. ఇక తాజాగా లావ‌ణ్య త్రిపాఠి త‌న సోష‌ల్ మీడియాలో ఆస‌క్తికర పోస్ట్ పెట్టింది. తన పెళ్లి వేడుకలోని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫోటోస్ షేర్ చేస్తూ భ‌ర్త గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలిపింది. నాకు తెలిసిన అత్యంత అద్భుతమైన, దయగల, కేరింగ్ ఉన్న వ్యక్తి ఇప్పుడు నా భ‌ర్త అయ్యాడు.

నేను చెప్పాల్సిన‌వి చాలా ఉన్నాయి కాని వాట‌న్నింటిని నా మ‌న‌సులోనే దాచుకుంటాను. మా కుటుంబాలు, ప్రియమైనవారి మధ్య మా మూడు రోజుల పెళ్లి జరిగింది. మా కల నెరవేరింది. ఈ రోజును చాలా ప్రత్యేకంగా చేసిన ప్రతి ఒక్కరికీ, మాకు శుభాకాంక్షలు పంపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ లావ‌ణ్య త్రిపాఠి త‌న సోష‌ల్ మీడియాలో ఎమోష‌న‌ల్ పోస్ట్ షేర్ చేసింది. లావణ్య పోస్ట్‏కు లవ్ ఎమోజీని షేర్ చేశాడు వరుణ్. ప్రస్తుతం లావణ్య పోస్ట్ నెట్టింట వైరలవుతుండగా ఆ పోస్ట్‌కి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కూడా ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేస్తున్నారు. 2017లో విడుదలైన మిస్టర్ సినిమా చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైనట్లుగా తెలుస్తోంది. దాదాపు ఆరేడేళ్ల తర్వాత వీరిద్దరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

Exit mobile version