Site icon vidhaatha

త‌ల్లి కాబోతున్న మెగా కొత్త కోడ‌లు.. తెగ ఫీలైపోతున్న మెగా ఫ్యాన్స్

మెగా ప్రిన్స్​​వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే.దాదాపుగా ఆరేళ్ల పాటు ప్రేమించుకుని.. పెద్దల ఆశీర్వాదంతో టుస్కానీలోని బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌లో అంగ‌రంగ వైభ‌వంగా పెళ్లి చేసుకున్నారు ఈ క్రేజీ జంట‌.గ‌త ఏడాది జూన్‌ 09న కుటుంబ సభ్యుల మధ్య ఈ జంటకు ఘ‌నంగా నిశ్చితార్ధం జర‌గ‌గా, నవంబర్ 01న పెళ్లి జ‌రిగింది. వీరి పెళ్లిలో మెగా ఫ్యామిలీ అంతా సంద‌డి చేశారు. అయితే పెళ్లి త‌ర్వాత లావ‌ణ్య త్రిపాఠి ఒక‌వైపు కుటుంబ బాధ్య‌త‌లు చూసుకుంటూనే మ‌రోవైపు కెరీర్ ప‌రంగా దూసుకుపోతుంది.లావ‌ణ్య న‌టించిన మిస్ ప‌ర్‌ఫెక్ట్ వెబ్ సిరీస్ ప్ర‌స్తుతం స్ట్రీమ్ అవుతుండ‌గా, దీనికి సంబంధించి ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌లో యాక్టివ్‌గా పాల్గొంటుంది. అనేక విష‌యాలు కూడా అభిమానుల‌తో పంచుకుంటుంది.

మెగా ఫ్యాన్స్ త‌న‌ని వ‌దిన అని పిలవడం సో స్వీట్ అంటూ కామెంట్స్ చేసింది. నిహారిక మాత్ర‌మే వ‌దిన అని పిలుస్తుంద‌ని, ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కూడా పిల‌వ‌డం ఆనందంగా ఉంద‌ని తెలియ‌జేసింది. ఇక వ‌రుణ్ స‌పోర్ట్ త‌న‌కి చాలా ఉంద‌ని కూడా లావ‌ణ్య తెలియ‌జేసింది. వరుణ్ తేజ్‌తో పెళ్లి తర్వాత కెరీర్ పరంగా ఏమీ మారలేదని కూడా లావ‌ణ్య తెలియ‌జేసింది. మెగా కుటుంబంలోకి వచ్చాక నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి అని నాకు ఎవ‌రు కూడా ఎలాంటి కండీష‌న్స్ పెట్ట‌లేద‌ని త‌న‌కు కావ‌ల్సినంత స్వేచ్చ ఉంద‌ని తెలియ‌జేసింది. వ‌రుణ్ లాంటి అర్ధం చేసుకునే భర్త త‌న‌కు దొర‌క‌డం త‌న అదృష్టం అంటూ పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించింది.

ఇక లావ‌ణ్య ప్ర‌స్తుతం పలు ప్రాజెక్ట్‌ల‌కి సైన్ చేస్తుంది. ఈ క్ర‌మంలో లావ‌ణ్య గురించి ఓ వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఆమె త‌ల్లి కాబోతుందంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే అది రీల్ లైఫ్‌లో రియ‌ల్ లైఫ్‌లో. రీసెంట్‌గా ఓ మూవీకి లావ‌ణ్య సైన్ చేసింద‌ని, అది మదర్ అండ్​సన్ సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కనుందని అంటున్నారు. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి స్టార్ హీరో చిన్నప్పటి పాత్రకు త‌ల్లిగా క‌నిపించ‌నుంద‌ని ఓ వార్త బలంగా వినిపిస్తుంది. సినిమాలో లావ‌ణ్య త్రిపాఠి పాత్ర‌కి మంచి గుర్తింపు ఉంటుంద‌ని అందుకే ఆ పాత్రకి ఓకే చెప్పింద‌ని అంటున్నారు. అయితే ఇందులో ఎంత క్లారిటీ ఉంద‌నేది తెలియాల్సి ఉంది. అయితే లావ‌ణ్య అప్పుడే త‌ల్లి పాత్ర‌ల‌కి ఓకే చెబుతుండ‌డం మెగా ఫ్యాన్స్‌కి ఏ మాత్రం మింగుడు ప‌డ‌డం లేదు.

Exit mobile version