హృద‌య విదార‌కం.. సింహం చేతిలో ఓట‌మి పాలైన అడ‌వి కుక్క‌లు.. వీడియో

అడ‌వికి రారాజు ఎవ‌రంటే.. సింహాం అని చెప్ప‌క త‌ప్పదు. ఎందుకంటే సింహాం ప్ర‌తి జంతువుపైన దాడి చేసి.. ర‌క్తాన్ని క‌ళ్లారా చూస్తుంది. ఆ జంతువుల మాంసాన్ని భ‌క్షిస్తుంది. మ‌రి అలాంటి క్రూర మృగానికి అడ‌వి కుక్క‌లు తార‌స‌ప‌డితే ఎలా ఉంటుందో ఆలోచించండి.

  • Publish Date - March 7, 2024 / 01:36 AM IST

అడ‌వికి రారాజు ఎవ‌రంటే.. సింహాం అని చెప్ప‌క త‌ప్పదు. ఎందుకంటే సింహాం ప్ర‌తి జంతువుపైన దాడి చేసి.. ర‌క్తాన్ని క‌ళ్లారా చూస్తుంది. ఆ జంతువుల మాంసాన్ని భ‌క్షిస్తుంది. మ‌రి అలాంటి క్రూర మృగానికి అడ‌వి కుక్క‌లు తార‌స‌ప‌డితే ఎలా ఉంటుందో ఆలోచించండి. క్ష‌ణాల్లోనే ఆ కుక్క‌ల‌ను చంపేసి.. భ‌క్షిస్తోంది. అలాంటి ఘ‌ట‌నే సౌతాఫ్రికాలోని బ‌లూలే నేచ‌ర్ రిజ‌ర్వ్‌లో వెలుగు చూసింది.

బ‌లూలే నేచ‌ర్ రిజ‌ర్వ్‌లో ఓ సింహాం స్వేచ్ఛ‌గా విహ‌రిస్తోంది. అదే స‌మ‌యంలో ఓ అడ‌వి కుక్క అటు వైపు వ‌చ్చింది. అడ‌వి కుక్క సింహాం కంట ప‌డింది. ఒక్క‌సారి ప‌రుగెత్తిన సింహాం.. ఆ కుక్క‌ను అమాంతం ప‌ట్టేసింది. కుక్క మెడ‌ను ప‌ట్టుకున్న సింహాం.. వ‌దిలిపెట్టలేదు. ఇక ఆ కుక్క అరుపులు విని మ‌రో రెండు కుక్క‌లు అక్క‌డికి చేరుకున్నాయి. సింహాం నుంచి కుక్క‌ను త‌ప్పించేందుకు త‌మ శ‌క్తిని ప్ర‌యోగించాయి. మ‌రికొద్ది క్ష‌ణాల్లోనే మ‌రో రెండు అడ‌వి కుక్క‌లు అక్క‌డికి చేరుకున్నారు. అలా నాలుగు కుక్క‌లు సింహాం బారి నుంచి త‌మ మిత్రుడిని ర‌క్షించుకునేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించాయి. కానీ ఫ‌లితం లేకుండా పోయింది. చివ‌ర‌కు ఈ పోరాటంలో కుక్క‌లు ఓట‌మి పాల‌య్యాయి. కుక్క‌ల ఆవేద‌న‌కు సంబంధించిన ఈ హృద‌య విదార‌క వీడియోను ఆ నేచ‌ర్ రిజ‌ర్వ్ గౌడ్ న‌కునా అనే వ్య‌క్తి లేటెస్ట్ సైటింగ్స్ అనే యూట్యూబ్ చానెల్‌లో పోస్టు చేశారు.

2 నిమిషాల 56 సెక‌న్ల నిడివి గ‌ల ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోను ఫిబ్ర‌వ‌రి 27న షేర్ చేయ‌గా, ఇప్ప‌టి వ‌ర‌కు 2 ల‌క్ష‌ల 60 వేల మంది వీక్షించారు.

Latest News