దర్శకధీరుడు రాజమౌళి చేసింది తక్కువ సినిమాలే అయిన ప్రతి సినిమాని ప్రేక్షకులు మెచ్చే విధంగా తెరకెక్కిస్తుంటారు. ఆయన కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ లేదు. ఓటమెరుగని విక్రమార్కుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి తన తదుపరి సినిమాని మహేష్‌తో భారీ స్కేల్‌లో చేస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి సినిమా అంటే హీరో తప్పనిసరిగా ఏళ్లపాటు కాల్షీట్స్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు మహేష్ బాబుని కూడా రెండేళ్లపాటు రాజమౌళి లాక్ చేశాడని టాక్.గత కొద్ది రోజులుగా మహేష్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులలో పాల్గొంటూనే ఉన్నాడు. అతి త్వరలో షూటింగ్ మొదలు కానుండగా, ఇక నాన్‌స్టాప్ షెడ్యూల్స్‌తో బిజీ కానున్నాడు సూపర్ స్టార్. అందుకేనేమో మహేష్ తన ఫ్యామిలీతో కలిసి సడెన్ ట్రిప్ వేశాడు.
సమ్మర్ వెకేషన్ ట్రిప్‌కి సంబంధించి మహేష్ భార్య నమ్రత ఓ పోస్ట్ చేసింది. నమ్రత తన పోస్ట్‌లో రాస్తూ.. తన భర్త, పిల్లలు.. అందరూ కలిసి సమ్మర్ వెకేషన్ కోసం వెళ్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఇక రాజమౌళి సినిమా పూర్తయ్యే వరకు ఎటూ వెళ్లే పరిస్థితి ఉండదు కాబట్టి ఈ సారి మహేష్ లాంగ్ టూరే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఏ ప్రాంతానికి మహేష్ ఫ్యామిలీ వెళ్లింది అనే దానిపై క్లారిటీ అయితే లేదు. ప్రస్తుతానికి మహేష్ ఫ్యామిలీకి సంబంధించి సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి సినిమా మొదలైందంటే.. అది ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి.. ఈ సినిమా కోసం మహేష్ రెండు సంవత్సరాలు కాల్షీట్స్ కేటాయించినట్టు తెలుస్తుంది.
మహేష్-రాజమౌళి సినిమాను ఉగాది పండుగ రోజున పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే సెట్స్ పైకి ఎప్పుడు అనేది చెప్పడం కష్టమే .. ఈ సినిమాలో మహేష్ లుక్ కి సంబంధించి ఇప్పటికే చాలా గెటప్స్, షూట్స్ జరిగాయి. అయితే ఏ గెటప్‌లో కనిపిస్తారే దానిపై మేటర్ బయటకు రావడం లేదు. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న రాజమౌళి ఈ సినిమాకి సంబంధించి కూడా అక్కడ మీడియాతో పలు విషయాలు చెప్పుకొచ్చాడు. మహేష్ బాబుని తప్పక జపాన్ తీసుకొస్తానని కూడా ఆయన ప్రామిస్ చేశాడు.