నిర్మల్ : నిర్మల్ జిల్లాలో పట్టపగలే దారుణం జరిగింది. ఖానాపూర్‌లోని శివాజీనగర్‌లో నడిరోడ్డుపై ప్రియురాలిని గొడ్డలితో నరికి చంపాడు. యువతి టైలరింగ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా యువకుడు దాడి చేశాడు. ఈ దాడిని అడ్డుకోబోయిన మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ వారిలో ఒక మహిళ, బాలుడు ఉన్నారు. మహిళ మృతురాలి బంధువు అని పోలీసుల విచారణలో తేలింది. అయితే పెళ్లికి నిరాకరించిందనే కోపంతోనే యువతిపై యువకుడు గొడ్డలితో దాడి చేసి చంపినట్లు తెలిసింది. మృతురాలి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.