Site icon vidhaatha

రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే వేడుక‌ల్లో మోహ‌న్ బాబు, చిరు గొడ‌వ‌ల గురించి క్లారిటీ ఇచ్చిన మనోజ్

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే వేడుక‌లు అంబరాన్ని అంటాయి. మార్చి 27న చ‌ర‌ణ్ త‌న బ‌ర్త్ డేని పుర‌స్క‌రించుకొని తిరుప‌తి వెళ్లి శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. ఆ త‌ర్వాత తిరిగి హైద‌రాబాద్ వ‌చ్చేశారు.s ఆయ‌న త‌న ఫ్యామిలీతో బ‌ర్త్‌డేని సెల‌బ్రేట్ చేసుకున్న‌ట్టు తెలుస్తుంది. అయితే అభిమానులు కూడా చ‌ర‌ణ్ బ‌ర్త్‌డేని పెద్ద ఎత్తున సెల‌బ్రేట్ చేశారు. ఓ ఈవెంట్‌ని నిర్వ‌హించి ఆ కార్య‌క్ర‌మానికి బుల్లితెర సెలెబ్రిటీలు, బిగ్ బాస్ సెలెబ్రిటీలు. టాలీవుడ్ నుంచి ప‌లువురు ప్ర‌ముఖుల‌ని ఆహ్వానించారు. అయితే ఈ ఈవెంట్ కి మంచు మనోజ్ అతిథిగా వ‌చ్చి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఇక ఈవెంట్‌లో మ‌నోజ్ మాట్లాడిన మాట‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

చెన్నైలో మా ఇళ్లు ప‌క్క‌ప‌క్క‌నే ఉండేవి. అంద‌రం క‌లిసి పెరిగాం. రామ్ చ‌ర‌ణ్ ఇంత పెద్ద స్టార్ అయిన చిన్న‌ప్ప‌టి ఫ్రెండ్స్ ఎవ‌రిని కూడా మ‌రిచిపోలేదు. ఆప‌ద‌లో ఉన్న‌వారిని ఆదుకుణే గుణం త‌క్కువ మందికి ఉంటుంది. అది రామ్ చ‌ర‌ణ్‌లో ఉంది. దుబాయ్‌లో ఒక తెలుగు ఆడ‌పిల్ల‌కి ఇమిగ్రేష‌న్ స‌మ‌స్య వ‌చ్చి ఫ్యామిలీ మొత్తాన్ని లాక్ చేస్తే వారికి నాకు చేత‌నైంత సాయం చేశాం. ఇంకా కావాల్సి ఉంది. ఎవరిని అడ‌గాలి అని ఆలోచిస్తుండ‌గా చెర్రీ గుర్తుకు వ‌చ్చి అత‌నికి ఫోన్ చేసి ఓ ఆడపిల్ల క‌ష్టాల‌లో ఉంది, 5 ల‌క్ష‌లు కావాలి అని అడిగితే అకౌంట్ నంబర్ పంపు బాబాయ్ అని చెప్పాడు. అకౌంట్ నెంబర్ పంపగానే క్షణాల వ్యవధిలో 5 లక్షలు పంపించాడు అని మ‌నోజ్ అన్నాడు. ఇక మంచు, మెగా ఫ్యామిలీ మ‌ధ్య ఫైటింగ్ గురించి కూడా ఓపెన్‌గా మాట్లాడాడు మ‌నోజ్.

నేను ఈ ఈవెంట్‌కి వ‌చ్చే ముందు మీ నాన్న మోహన్ బాబు గారు.. చ‌ర‌ణ్‌ నాన్న చిరంజీవి గారు ఎప్పుడూ గొడవపడుతుంటారు.. మళ్ళీ కలసి పోతుంటారు. కానీ నువ్వు మాత్రం చరణ్ తో ఎప్పుడు స్నేహంగా ఉంటున్నావేంటి అని అడిగారు. అప్పుడు వారికి నేను ఏమి స‌మాధానం ఇచ్చానంటే భార్య భ‌ర్త‌ల‌న్నాక గొడ‌వ‌లు ప‌డ‌తారు, క‌లిసిపోతారు. వారి గురించి బ‌య‌ట‌వాళ్లు జోక్యం చేసుకోకూడ‌దు. వారిద్దరిది 45 ఏళ్ల బంధం. మాలాగే ఎప్ప‌టికి క‌లిసి ఉండాలి, విడిపోకూడ‌దు. చిరంజీవి గారు.. మోహన్ బాబు గారు క్యూట్ టామ్ అండ్ జెర్రీ అని పెద్ద‌రాయుడు డైలాగ్ స్టైల్‌లో చెప్పాడు. మెగా ఫ్యామిలీ, మంచు మధ్య రిలేషన్ ఫిష్ అండ్ వాటర్ లాగా ఉండాలి.. ఫిష్ అండ్ ఫిషర్ మాన్ లాగా కాదు అంటూ మ‌నోజ్ త‌న డైలాగ్‌తో అద‌ర‌గొట్టేశాడు.

Exit mobile version