Site icon vidhaatha

గుడ్ న్యూస్ చెప్పిన మంచు మ‌నోజ్‌.. కావాలనే అన్న పేరు చెప్ప‌లేదా?

మంచు మోహ‌న్ బాబు ముద్దుల త‌న‌యుడు మంచు మ‌నోజ్‌కి అన్ని మంచి శ‌కునాలే ఉన్న‌ట్టుగా క‌నిపిస్తుంది. ఇటీవ‌ల మ‌నోజ్ జీవితంలో అంతా మంచే జ‌రుగుతుంది. కెరీర్ పరంగా ప‌లు సినిమాలు చేస్తుండ‌గా, అలానే హోస్ట్‌గా అలరించే ప్ర‌య‌త్నం కూడా చేస్తున్నాడు. ఇక పర్స‌న‌ల్ లైఫ్‌లో త‌ను ప్రేమించిన అమ్మాయి భూమా మౌనికా రెడ్డిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అయినట్లు తెలిపారు. దివంగత భూమా శోభా, నాగిరెడ్డి మరోసారి అమ్మమ్మ, తాతయ్య కాబోతున్నారంటూ ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో మంచుఉ మ‌నోజ్ తెలియ‌జేశారు. తన అత్తమ్మ శోభా నాగిరెడ్డి, మావయ్య భూమా నాగిరెడ్డి మరోసారి అమ్మమ్మ, తాతయ్య కాబోతున్నారని అన్నారు.

అలాగే, అన్నయ్యగా తనకు ప్రమోషన్ వస్తున్నందుకు భూమా మౌనికా రెడ్డి కుమారుడు ధైరవ్ చాలా హ్యాపీగా ఉన్నాడని, తన అత్తమ్మ, మావయ్య ఎక్కడున్నా తమను ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. అలాగే, తన తల్లి నిర్మల, తండ్రి మోహన్ బాబు ఆశీస్సులతో తమ కుటుంబం చాలా సంతోషంగా ఉందని చెప్పారు మంచు మనోజ్. మనోజ్ చేసిన ఈ ట్విట్‌లో ఎక్కడా కూడా తన అన్న విష్ణు గురించి ప్రస్తావించలేదు. భూమా మౌనికా రెడ్డి, మంచు మనోజ్ వివాహం ఈ ఏడాది మార్చిలో జరిగింది. మనోజ్ రెండో వివాహం జరిగిన కొద్ది రోజులకే ఆయన ఇంటిపై మంచు విష్ణు దాడి చేసిన వీడియో అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించ‌డం మనం చూశాం.

ఈ వివాదం గురించి ఇంత వ‌ర‌కు పూర్తి క్లారిటీ రాలేదు. మంచు మనోజ్ ఇటీవల మీడియాతో మాట్లాడిన సమయంలో కూడా అన్నతో విభేదాలు గురించి మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేశారే త‌ప్ప పూర్తి క్లారిటీ ఇవ్వ‌లేదు. ఇంకా విబేధాలు కొన‌సాగుతున్నాయి కాబ‌ట్టే మ‌నోజ్ గుడ్ న్యూస్ పంచుకునే స‌మ‌యంలో త‌న అన్న పేరు ఎక్క‌డ ప్ర‌స్తావించ‌లేద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో మనోజ్ భార్య భూమా మౌనిక పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. భార్య త‌ర‌పున ప్ర‌చారం చేయ‌డానికి మ‌నోజ్ సిద్ధ‌మ‌య్యాడు. మ‌రి ఇలాంటి స‌మ‌యంలో మౌనిక పాలిటిక్స్‌లోకి అడుగుపెడుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది.

Exit mobile version