న్యూజిలాండ్‌లో రూల్స్ బ్రేక్ చేసి దొంగ‌త‌నం చేసిన మంచు విష్ణు.. ఆ త‌ర్వాత ఏమైందంటే..!

  • Publish Date - December 14, 2023 / 11:26 AM IST

మంచువార‌బ్బాయి మంచు విష్ణు ఈ సారి బాక్సాఫీస్‌పై గ‌ట్టిగానే ఫోక‌స్ చేశాడు. పెద్ద హిట్ కొట్టాల‌నే క‌సితో ఉన్న విష్ణు తన డ్రీమ్‌ప్రాజెక్టుగా కన్నప్ప అనే చిత్రం చేస‌తున్నాడు. గ‌త కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉంటున్నాడు. ముక్కంటి కొలువైన శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మరీ కన్నప్ప మూవీని పట్టాలెక్కించ‌గా, ప్రస్తుతం న్యూజిలాండ్‌లో కన్నప్ప షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పరమ శివుడి మహా భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న కన్నప్ప సినిమాలో మంచు విష్ణు టైటిల్ రోల్‌లో క‌నిపించి మెప్పించ‌నున్నాడు.

చిత్రంలో శివపార్వతులుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నయనతార నటించనున్నారు. అలాగే మాలీవుడ్ నుంచి మోహన్ లాల్, శాండల్ వుడ్ నుంచి శివ రాజ్ కుమార్, కోలీవుడ్ నుంచి శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం తదితర దిగ్గజ నటీనటులు కన్నప్ప మూవీలో ప‌లు పాత్ర‌ల‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నున్నారు. ఈ చిత్రాన్ని హిందీలో మహాభారత్ వంటి సీరియల్‌ను రూపొందించిన ముఖేష్ కుమార్ సింగ్ క‌న్న‌ప్ప చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నాడు. ఇక పాన్‌ ఇండియా స్థాయిలో రూ.150 కోట్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు మోహన్‌ బాబు. సింగల్ షెడ్యూల్ తో ఈ మూవీని న్యూజిలాండ్ లోనే పూర్తి చేయనున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఈ మూవీకి కావాల్సిన సెట్ ప్రోపర్టీ, ఆర్టిస్ట్ లు అందరూ న్యూజిలాండ్ లోనే ఉంటున్నారు.

అయితే మంచు విష్ణుతో పాటు ఆయన సతీమణి ‘విరానికా రెడ్డి’ కూడా ప్ర‌స్తుతం న్యూజిలాండ్ లోనే ఉంటున్నారు. “న్యూజిలాండ్ లో మంచు విష్ణు, విరానికా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కన విరానికాకి ఇష్టమైన హైడ్రేంజ పూలు కనిపించాయి. దీంతో విష్ణు కారు ఆపి నాకోసం వాటిని కోసుకు వచ్చారట‌. ఈ విష‌యాన్ని విరానిక త‌న పోస్ట్‌లో చెప్పుకొచ్చింది. అయితే న్యూజిలాండ్‌లో ఎక్క‌డ ప‌డితే అక్క‌డ పూలు కోయడం పెద్ద నేరం.పోలీసుల క‌ళ్లుగ‌ప్పి విష్ణు ఆ పూలు కోసిన కెమెరాల‌లో మాత్రం దొరికాడంటే అంతే అంటూ కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. న్యూజిలాండ్‌ పోలీసులు ఈ వీడియో చూడకుండా ఉండాలని కోరుకోండి అంటూ మంచు విష్ణుకి కొంద‌రు సూచ‌న‌లు చేస్తున్నారు. విరానిక షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

Latest News