Site icon vidhaatha

కంప్లీట్ స్టార్ మోహ‌న్ లాల్‌ సినిమాల‌ని ఎక్కువ‌గా రీమేక్ చేస్తున్నారేంటి.. నాగార్జున అయితే మరీను..!

నాలుగు ద‌శాబ్ధాల సినీ ప్ర‌యాణంలో ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి కంప్లీట్ స్టార్‌గా పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్నారు మోహ‌న్ లాల్. ఏడాదిలో ఎక్కువ సినిమాలు చేసే హీరోగా పేరు గ‌డించాడు. ప్ర‌తి సంవ‌త్స‌రం ఆరు సినిమాల‌ని అయిన ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని టార్గెట్ పెట్టుకుంటాడు. కుద‌రని ప‌క్షంలో నాలుగు సినిమాలతో అల‌రిస్తాడు. మూడు షిఫ్టుల‌లో రేయింబ‌వ‌ళ్లు క్ష‌ణం తీరిక లేకుండా ప‌ని చేసే మోహ‌న్ లాల్ సినిమాల‌కి మంచి డిమాండ్ ఉంది. అయితే మోహ‌న్ లాల్ సినిమాల‌ని చాలా మంది హీరోలు రీమేక్స్ చేస్తూ మంచి హిట్స్ అందుకుంటున్నారు.

నంద‌మూరి బాల‌య్య.. మోహన్ లాల్ నటించిన ఆర్యన్ అనే మూవీని అశోక చ‌క్ర‌వ‌ర్తి అంటూ తెలుగులో రీమేక్ చేశాడు. ఈ మూవీ 1989లో విడుదలైంది. ఎస్ఎస్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఇళ‌య‌రాజా సంగీతం అందించ‌గా, ఇందులో భానుప్రియ క‌థానాయిక‌గా న‌టించింది. ఈ మూవీ పెద్ద‌గా మ్యాజిక్ చేయ‌లేక‌పోయింది. ఇక మోహన్ బాబు సినీ కెరీర్‌లో మైలు రాయిగా నిలిచిన అల్లుడుగారు చిత్రం మోహ‌న్ లాల్ న‌టించిన చిత్రం అనే సినిమాకి రీమేక్. చిత్రం మూవీ 1988లో రిలీజ్ కాగా, అల్లుడు గారు 1990లో రిలీజై పెద్ద హిట్ కొట్టింది. ఇక కింగ్ నాగార్జున మోహన్ లాల్ వందనం మూవీకి రీమేక్‌గా నిర్ణ‌యం అనే సినిమా చేశాడు. ఇందులో అమ‌ల‌తో క‌లిసి న‌టించాడు నాగ్. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్టో మ‌నంద‌రికి తెలిసిందే.

నిర్ణయం మాత్రమే కాకుండా నాగార్జున.. మోహ‌న్ లాల్ న‌టించిన చాలా సినిమాలు రీమేక్ చేశాడు. అందులో 1995లో వచ్చిన వజ్రం, 1998 సంవత్సరంలో వచ్చిన చంద్రలేఖ చిత్రాలు ఉన్నాయి ఉన్నాయి. 1997లో మోహన్ లాల్ హీరోగా వ‌చ్చిన‌ చంద్రలేఖను అదే టైటిల్‌తో రీమేక్ చేయగా.. 1995లోని స్పదికంను వజ్రంగా రీమేక్ చేశారు. వ‌జ్రం అంత హిట్ కాలేదు కాని, చంద్ర‌లేఖ మాత్రం మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది . ఇక నాగార్జున, మోహన్ బాబు కలిసి నటించిన సినిమా అధిపతి చిత్రం ..మోహన్ లాల్ నరసింహం మూవీకి రీమేక్. ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం మోహ‌న్ లాల్ మూవీని రీమేక్ చేశారు. చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ ,,మోహన్ లాల్ లూసీఫర్‌కు రీమేక్ అనే విష‌యం తెలిసిందే.ఇక సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ చేసిన ముత్తు సినిమా మోహన్ లాల్ నటించిన తెన్మవిన్‌కు రీమేక్ గా రూపొంది ఎంత పెద్ద విజ‌యం సాధించిందో మ‌నంద‌రికి తెలిసిందే. రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు సైతం మోహ‌న్ లాల్ సినిమాల‌ని రీమేక్ చేశారు. అయితే అందరిలో క‌న్నా నాగార్జున ..మోహ‌న్ లాల్ సినిమాల‌ని ఎక్కువ‌గా రీమేక్ చేయ‌డం విశేషం.

Exit mobile version