Site icon vidhaatha

రిష‌బ్ పంత్ ఈజ్ బ్యాక్‌.. క్రికెట్ కాదు ధోనితో టెన్నిస్ ఆడుతున్నాడుగా..!

టీమిండియా రెగ్యులర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడి కొద్ది రోజుల పాటు ఆసుప్ర‌తిలో చికిత్స తీసుకున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పంత్ త్వ‌ర‌లోనే మైదానంలోకి అడుగుపెట్ట‌నున్న‌ట్టు కొన్నాళ్ల నుండి వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే పంత్ ఐపీఎల్ వేలంలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున వేలంలో పాల్గొని కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసేలా తమ ఫ్రాంచైజీకి సూచనలు ఇవ్వ‌డం ఆయ‌న అభిమానుల‌కి ఆనందాన్ని క‌లిగించింది. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఐపీఎల్ ద్వారా బ‌రిలోకి దిగి జాతీయ జ‌ట్టులో స‌త్తా చాటాల‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే పంత్ ఈ సారి జట్టు తరపున ఆక్షన్‌లో పాల్గొన్న తొలి కెప్టెన్‌గా నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున పంత్ వేలానికి రావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ఇక వేలం పూర్త‌య్యాక పంత్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ ఓ మ్యాచ్‌లో తలపడ్డారు. అయితే అది క్రికెట్‌లో కాదు, టెన్నిస్‌లో.. ఆక్షన్ ముగిసిన అనంతరం ధోనీ-పంత్ సరదాగా టెన్నిస్ ఆడారు. నీటిపై ఏర్పాటు చేసిన టెన్నిస్ కోర్టులో ధోనీ, పంత్ ప్రత్యర్థుల్లా ఈ మ్యాచ్‌లో ఆడారు.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే ధోనీపై పంత్ బలంగా ఓ షాట్ కొట్ట‌డంతో మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్న ఫ్యాన్స్ ఒక్కసారిగా కేకలు వేసారు. దాంతో పంత్ నవ్వుతూ రిప్లై ఇచ్చాడు. ఇక ఇదిలా ఉంటే ఐపీఎల్ 2024 వేలానికి ముందు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిష‌బ్ పంత్ మాట్లాడుతూ.. “నేను బతికి ఉన్నందుకు అదృష్టవంతుడిని, నేను చాలా పెద్ద ప్ర‌మాద‌మే ఎదుర్కొన్నాను.

ప్ర‌మాదం నుంచి కోలుకోవ‌డం నాకు చాలా సవాలుగా మారింది. ప్రారంభంలో ఎంతో బాధ‌ను భ‌రించాను. కానీ ఇప్పటి వరకు ప్రయాణాన్ని చూస్తే, రికవరీ పాయింట్ నుండి ఇది చాలా బాగా సాగుతుందని నేను భావిస్తున్నానని అని పంత్ అన్నారు.కఠోర సాధన చేస్తూ తిరిగి ఫామ్ అందుకునే ప్రయత్నం చేస్తున్న పంత్.. ఐపీఎల్ 2024లో ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు.


Exit mobile version