Site icon vidhaatha

బిగ్ బాస్ సీజ‌న్ 17 విన్న‌ర్ ఎవ‌రు.. ఎంత ప్రైజ్‌మ‌నీ గెలుచుకున్నాడు…!

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది. తెలుగులో ఇటీవ‌లే ఏడో సీజ‌న్ పూర్తి కాగా, కామ‌న్ మ్యాన్ అయిన ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ విజేత‌గా నిలిచాడు. ఇక తాజాగా హిందీ బిగ్ బాస్ కూడా పూర్తైంది. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ హూస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షోకి ఫుల్ క్రేజ్ ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు 17 సీజ‌న్స్ పూర్తి చేసుకుంది. తాజాగా సీజ‌న్ 17 ఫినాలే ఎపిసోడ్ జ‌ర‌గ‌గా, విజేత‌గా మునవర్ ఫరూఖీ షో విజేతగా అవతరించాడు. అతనికి హోస్ట్ సల్మాన్ ఖాన్ ట్రోఫీని అందజేశారు. మ‌న్నారా చోప్రా అతనికి గ‌ట్టి పోటీ ఇచ్చిన చివ‌రికి మున‌వ‌ర్‌ని అదృష్టం వరించింది. జ‌న‌వ‌రి 28న ఫినాలే ఎపిసోడ్‌ని ఎంతో గ్రాండ్‌గా ప్లాన్ చేశారు.

గ్రాండ్ ఫినాలేలో ఎంతోమంది టీవీ సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు. మునావర్ ఫారుఖి, అభిషేక్ కుమార్ చివ‌రి వ‌ర‌కు నిల‌వ‌గా, ఈ ఇద్ద‌రిలో ఎవరు విన్న‌ర్ అవుతార‌నే ఆస‌క్తి అంద‌రిలో పెరిగిపోయింది. ఆ స‌మ‌యంలో స‌ల్మాన్ ఖాన్.. బిగ్ బాస్ సీజన్ 17 విన్నర్‌గా మునావర్ ఫారుఖిని ప్రకటించాడు ..ఫైనల్స్‌కు ముందు సోషల్ మీడియాలో జరిగిన ట్రెండ్స్ చూస్తుంటే మునావరే విన్నర్ అవ్వాలని చాలామంది కోరుకున్నారు. వారి కోరిక మేర‌కు మున‌వ‌ర్ విజేత‌గా నిలిచాడు. ఇక గెలిచిన మునావ‌ర్‌కి రూ.50 లక్షల క్యాష్ ప్రైజ్ మ‌నీతో పాటు ఒక లగ్జరీ కారును అందించారు. మునావర్ ఫారుఖి ఒక స్టాండప్ కమెడియన్..తను చేసిన స్టాండప్ షో వల్ల కొందరి మనోభావాలు దెబ్బతిని పెద్ద కాంట్రవర్సీనే క్రియేట్ అయ్యింది.

కొన్నాళ్ల వరకు అత‌ను షోలు చేయడానికి నిషేదించారు కూడా. ఇక అలాంటి కాంట్రవర్షియల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న మునావర్‌ను బిగ్ బాస్ సీజన్ 17లో కంటెస్టెంట్‌గా తీసుకొచ్చి హైప్ క్రియేట్ చేశారు. చివ‌రికి అత‌ను విజేత‌గా నిలిచాడు. ఇక బాలీవుడ్ బ్యూటీ కంగనా ర‌నౌత్ హోస్ట్ చేసిన టీవీ రియాలిటీ షో లాక్అప్ 2022లో కూడా మునావ‌ర్ విజేత‌గా నిలిచాడు. ఇక ఇదిలా ఉంటే హైద‌రాబాద్‌కి చెందిన శ్రీకాంత్ మాశెట్టి కూడా బిగ్ బాస్ సీజ‌న్ 17లో పాల్గొన‌గా, అత‌ను ఐదో స్థానంలో నిలిచాడు. యూట్యూబ‌ర్‌గా పాపుల‌ర్ అయిన అత‌ను షోలో ర‌స‌వ‌త్త‌రంగా గేమ్ ఆడాడు. అద్భుత‌మైన ఆట తీరుతో ఫినాలే వ‌ర‌కు చేరిన కూడా విజేత‌గా నిల‌వ‌లేక‌పోయాడు.

Exit mobile version