బిగ్ బాస్ తెలుగు కార్యక్రమం శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున ఎప్పటి మాదిరిగానే హౌజ్‌మేట్స్‌కి గట్టి క్లాస్ పీకాడు. తప్పొప్పులని తెలియజేస్తూ వారికి చురకలు అంటించాడు. శనివారం ఎపిసోడ్‌తో బిగ్ బాస్ సీజన్ 7 కార్యక్రమం హాఫ్ సెంచరీ కొట్టింది.ఇక బిగ్ బాస్ హౌజ్‌లో శోభ పేరుతో ఉన్న కేక్‌ని అమర్ దీప్ తినడంపై చర్చ రాగా, నాగ్ చేసిన ప్రాంక్ అందరిని ఆకట్టుకుంది .శోభా శెట్టి నీ పేరుతో ఉన్న కేక్ అమర్‌కి ఎందుకిచ్చావని, అమర్ దీప్.. ఎందుకు తిన్నావని, తేజ చెప్పడంతో చేశానని అమర్ దీప్ అనడం ఇలా పలు రకాలుగా వారిని తెగ ఆడేసుకున్న తర్వాత చివరికి ఇది ప్రాంక్ అని నాగార్జున తెలియజేశాడు. అంతేకాకుండా ఈ వారం ఆట బాగా ఆడినందుకు మరో కేక్ తెప్పించి అమర్‌కి ఇచ్చారు
ఇక ఆ తర్వాత కుండ బద్దలు కొట్టే గేమ్ ఆడాడు నాగ్. ఒక్కోక్కరు చేసిన తప్పులను ఎత్తిచూపుతూ నాగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భోలే బూతులు మాట్లాడడం గురించి, అలానే ఆమె విషయంలో ఎర్రగడ్డ అనే పదం వాడటంపై కూడా నాగార్జున నిలదీసాడు. అయితే భోలే అందుకు క్షమాపణ చెప్పినట్టు ఒప్పుకోగా, శోభా మాత్రం ఆ మాటలని తాను క్షమించలేనని, ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొంది. ఇక శోభా శెట్టి, తేజ మధ్య టాటూ బాండింగ్ గురించి టాపిక్ రాగా, తాను టాటూ వేయించుకోలేనని, అంత ప్రేమ లేదని చెప్పాడు. టెంపరరీగా వేయించుకోవడానికి మాత్రం సిద్ధంగా ఉన్నట్టు తెలియజేశారు శోభ.
ఇక శివాజీ ఆరోగ్యం గురించి నాగార్జున ఆరాలు తీసారు. చేయి నొప్పి వలన బాధగా ఉందని ఆయన తెలియజేయగా, దానికి నాగ్.. ఫిజియో థెరఫీ చేయిస్తానని హామీ ఇచ్చారు. అలా సెట్ కాకపోతే బిగ్ బాస్ నిర్ణయం తీసుకుంటాడని అన్నారు. ఇక ప్రశాంత్ తనని ఊరోడు అని అన్నారని చేసిన కామెంట్స్ గురించి కూడా నాగ్ డిస్కస్ చేశారు. ఇక అనంతరం లాడర్(నిచ్చెన), స్నేక్(పాము) గేమ్ కంటెస్టెంట్స్ చేత ఆడించాడు నాగార్జున. తమకి హౌజ్‌లో పాము ఎవరు, నిచ్చెన ఎవరు అనేది చెప్పమనగా, అశ్విని.. తనకు పాము శోభా శెట్టి అని, గౌతమ్ నిచ్చెన అని, గౌతమ్.. పాము శివాజీ అని, నిచ్చెన అర్జున్ అని, శివాజీ.. నిచ్చెన యావర్ అని, పాము అమర్ దీప్ అని తెలిపారు. అమర్ దీప్.. నిచ్చెన అర్జున్ అని, పాము తేజ అని చెప్పాడు. అర్జున్.. నిచ్చెన్న గౌతమ్ అని, పాము శివాజీ అని, యావర్.. పాము గౌతమ్ అని, నిచ్చెన శివాజీ అని చెప్పారు. పూజా.. నిచ్చెన అర్జున్ అని, పాము అశ్విని అని తెలిపారు. భోలే.. నిచ్చెన శివాజీ అని, పాము శోబా శెట్టి అన్నారు శోభా.. పాము భోలే, నిచ్చెన ప్రియాంక, సందీప్.. నిచ్చెన శోబా శెట్టి, పాము శివాజీ అని, తేజ.. నిచ్చెన అమర్ దీప్ అని, పాము యావర్ అని, ప్రశాంత్.. పాము పూజా అని, నిచ్చెన శివాజీ అని తెలిపారు.