మంచి హిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నాగార్జునకి సంక్రాంతి బాగానే కలిసి వచ్చింది. నా సామిరంగ చిత్రంతో క్రేజీ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం మంచి వసూళ్లు కూడా రాబడుతుంది. మూవీ మంచి విజయం సాధించిన నేపథ్యంలో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందుగా అక్కినేని అభిమానులకు థాంక్స్. నేను హిట్లిచ్చినా, ఫ్లాపులిచ్చా.. వారెప్పుడూ నా వెన్నంటే ఉన్నారు.. నేను కనిపిస్తే నవ్వుతూ పలకరిస్తుంటారు.. అక్కినేని అభిమానులకు థాంక్స్.. వారే నా బలం..ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్ అని చెప్పారు.
ఇక ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నామని చాలా లేటుగా చెప్పాం. డిస్ట్రిబ్యూటర్లు ఎంతో పాజిటివ్‌గా స్పందించి మాకు థియేటర్లు ఇచ్చారు. మా టీంకు థాంక్స్ కంటే.. నేను వాళ్లని ఎక్కువ మిస్ అవుతున్నాను.. ఎంతో హాయిగా షూట్ చేశాం..అందరూ నవ్వుతూనే కనిపించే వారు.. సినిమాను త్వరగా పూర్తి చేయాలనే కష్టపడి కాకుండా ఇష్టపడి చేశాం.. జనవరి 3, 4కే సినిమాను పూర్తి చేశాం. ఆ తరువాత అంతా సినిమా గురించే ఆలోచిస్తూ ఉన్నాను.ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 20న ప్రారంభించాం. మా నాన్న గారి జయంతి. ఆ రోజున ఈవెంట్ కూడా చేశాం. నాన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరించాం. అయితే ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నట్టు నా ఫ్యామిలీ మెంబర్లకు కూడా తెలీదు. ఆ రోజు కాస్త ఫాస్ట్‌గా అక్కడి నుంచి వెళ్తుంటే.. ఎక్కడికి వెళ్తున్నావ్ అని అమల అడిగింది.
సినిమా స్టార్ట్ చేయాలి అందుకే వెళ్తున్నా అని చెప్పాను. అవును అదేదో సాయంత్రం వెళ్లొచ్చు కదా? అని అమల అంది. కాదు అది సంక్రాంతికి రిలీజ్ చేయాలి.. అని చెప్పా. అలా అనగానే అందరూ బిత్తర మొహాలేసుకుని చూశారు. ఏమైనా పిచ్చెక్కిందా? అన్నట్టు అమల.. పిల్లలు చైతు, అఖిల్ చూశారు. ఎవరితో చెప్పినా కూడా మమ్మల్ని ఎవ్వరూ నమ్మలేదు. కానీ మా టీం మాత్రం నమ్మింది. అదే నాకు చాలని అనుకున్నా.. మేం సినిమాను పూర్తి చేశాం. కీరవాణి గారి వల్లే ఈ సినిమాను టైంకు ఫినిష్ చేశాం. ఆయన వేసిన టైం టేబుల్ వల్లే పూర్తయింది. చంద్రబోస్ గారు మాకు ఎన్ని సార్లైనా లిరిక్స్ కరెక్ట్ చేసి ఇచ్చారు. ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే అనే పాటతోనే పాజిటివ్ వైబ్ వచ్చింది. మా గురించి పాజిటివ్‌గా రాసిన మీడియాకు థాంక్స్. వచ్చే సంక్రాంతికి కలుద్దాం అంటూ నాగార్జున ఆసక్తికరంగా మాట్లాడారు.