Site icon vidhaatha

ఒక్క‌డు సినిమాలో క‌థానాయిక‌గా న‌మ్ర‌త‌ని అనుకున్నారా..కృష్ణ ఎందుకు రిజెక్ట్ చేశాడంటే..!

సూప‌ర్ స్టార్ కృష్ణ త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్‌గా అల‌రించాడు. ఆ త‌ర్వ‌త హీరోగా ఎదిగాడు. త‌న ప్రతి సినిమా విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ స్టార్ హీరోగా ఎదిగాడు. రీసెంట్‌గా గుంటూరు కారం చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన మ‌హేష్ బాబు ఇప్పుడు రాజ‌మౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతుంది. ఈ చిత్రంతో మ‌హేష్ బాబు క్రేజ్ ఓ రేంజ్‌లో పెరిగిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. అయితే తాజాగా మ‌హేష్ బాబు న‌టించిన ఒక్క‌డు సినిమాకి సంబంధించి ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. మ‌హేష్ కెరీర్ మొద‌ట్లో వ‌రుస ఫ్లాపుల‌తో ఇబ్బంది ప‌డుతున్న మ‌హేష్‌కి ఒక్క‌డు చిత్రం మంచి విజయం అందేలా చేసింది.

ఒక్కడు సినిమాలో మహేష్ బాబు ని అప్పటివరకు ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ చూపించని విధంగా స‌రికొత్త‌గా చూపించాడు ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్. ఈ క్ర‌మంలో మ‌హేష్ బాబుకి మంచి హిట్ ద‌క్కింది. అయితే ఈ చిత్రంలో క‌థానాయిక‌గా భూమిక న‌టించ‌గా, కీల‌క పాత్ర‌లో ప్ర‌కాశ్ రాజ్ న‌టించి మెప్పించారు. మూవీలో హీరోయిన్‌గా భూమిక క‌న్నా ముందు న‌మ్ర‌త‌ని తీసుకోవాల‌నే ఆలోచ‌న చేశార‌ట‌. అందుకు కార‌ణం వంశీ సినిమాలో మ‌హేష్‌, న‌మ్ర‌త‌కి మ‌ధ్య మంచి కెమిస్ట్రీ కుద‌ర‌డం మంచి పేరు రావ‌డంతో ఒక్క‌డులో కూడా న‌మ్ర‌త‌ని తీసుకోవాల‌ని అనుకున్నార‌ట‌. అయితే ఈ నిర్ణ‌యానికి కృష్ణ అడ్డుప‌డ్డాడ‌ని టాక్.

నమ్ర‌త‌కి తెలుగులో పెద్ద‌గా స‌క్సెస్‌లు లేవు. ఆమెని క‌థానాయిక‌గా తీసుకుంటే సినిమా మార్కెట్ కూడా పెద్దగా జ‌ర‌గ‌దు. ఈ సినిమాకి ముందు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఖుషి సినిమా చేసి పెద్ద హిట్ కొట్టిన భూమిక అయితే బాగుంటుంద‌ని కృష్ణ స‌ల‌హ ఇవ్వ‌డంతో చివ‌రికి ఆమెని క‌థానాయిక‌గా తీసుకున్నారు. ఈ క్ర‌మంలో కృష్ణ చెప్పినట్టుగానే భూమిక‌ని తీసుకోవ‌డం, సినిమా పెద్ద హిట్ కావ‌డం కూడా జ‌రిగింది. భూమిక సినిమాకి చాలా హెల్ప్ అయింది. అలా ఒక్క‌డులో క‌థానాయిక‌గా న‌మ్ర‌త న‌టించాల్సి ఉండ‌గా, ఆ అవ‌కాశం భూమిక దగ్గ‌ర‌కు వెళ్లింద‌న్న‌మాట‌.

Exit mobile version