టాలీవుడ్ క్రేజీ జంటలలో గీతా మాధురి, నందు జంట కూడా ఒకటి. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఉన్నారు. ఇక వీరి గురించి నెట్టింట అనేక ప్రచారాలు చక్కర్లు కొడుతుంటాయి. వాటన్నింటిని ఎప్పటికప్పుడు కొట్టి పారేస్తుంటారు నందు. గీతూ మాధురి సింగర్‌గా దూసుకుపోతుండగా, నందు నటుడిగా, హోస్ట్‌గా అలరిస్తున్నాడు. నందు గతేడాది ‘బొమ్మ బ్లాక్ బాస్టర్’ తో, అంతకు ముందు ‘సవారి’తో ప్రేక్షకులను అలరించగా, రీసెంట్ గా ‘వధువు’ అనే వెబ్ సిరీస్ తో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఇందులో నందు సరసన అవికా గోర్ నటించింది. ఈ వెబ్ సిరీస్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా, గట్టి వ్యూస్‌ని కూడా రాబడుతుంది.
అయితే వధువుకి మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో నందు పలు ఇంటర్వ్యూలు ఇస్తూ తన సిరీస్‌పై మరింత ఆసక్తి కలిగిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన భార్య గీతా మాధురి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. గీతా మాధురి చేసిన పనికి డబ్బులన్నీ పోయాయని, ఓసారి తనకు వచ్చిన కోపంతో డబ్బులు విసిరేసి వెళ్లిపోయానంటూ నందు స్పష్టం చేశారు. ఒకసారి నందు, గీతా మాధురి లండన్‌కి వెళ్లగా అక్కడ క్యాసినో గేమ్ ఆడేందుకు గీతా మాధురి ఆసక్తి చూపిందట. వెంటనే నేర్చుకొని డబ్బులు అన్ని పోగొట్టింది. ఆ తర్వాత న్యూజిలాండ్, కాలిఫోర్నియాలోనూ ఆడి మనీ పోగొట్టుకుందంని నందు అన్నాడు. గేమ్ మీద ధ్యాస ఎక్కువైపోవడంతో ఓసారి సమయం తెలియకుండా ఆడుతూనే ఉంది. దాంతో కోపంతో నేను డబ్బులు విసిరేసి బయటకు వచ్చాను.
అయితే క్యాసినో బయట తాము ఇద్దరు గొడవపడుతుంటే పోలీసులు వచ్చి ఏం గొడవ మీ మధ్య అని అడిగారట. అప్పుడు తామిద్దరం భార్య భర్తలు అని చెప్పడంతో అక్కడి నుండి వెళ్లిపోయారని, గీతా ఆ సమయంలో తనకు సారీ కూడా చెప్పిందటని నందూ పేర్కొన్నాడు. ఇక తామిద్దరు విడిపోయారని వస్తున్న వార్తలపై స్పందించిన నందు… తాము ఇద్దరం కలిసి ఫొటోలను షోస్ట్ చేయకపోవడం, కలిసి ఆయా ఫంక్షన్లకు రాకపోవడంతోనే ఇలాంటి రూమర్లు వచ్చాయని, అలాంటి వార్తలలో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశాడు నందు. ప్రస్తుతం ఆయన ‘అగ్లీ స్టోరీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. డెబ్యూ డైరెక్టర్ ప్రణవ స్వరూప్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.