నాని ఎంత మంది యంగ్ డైరెక్టర్స్‌ని ప‌రిచ‌యం చేశాడో తెలిస్తే షాక‌వుతారు..!

  • Publish Date - December 9, 2023 / 11:38 AM IST

నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రు. ఆయ‌న ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి సొంత టాలెంట్‌తో ఈ స్థాయికి ఎదిగారు. ప్ర‌తి సినిమా కోసం ఏదో ఒక‌టి కొత్త‌గా ట్రై చేస్తుంటారు. అంతేకాదు యువ ద‌ర్శ‌కుల‌తో క‌లిసి ప్ర‌యోగాలు చేస్తుంటారు. అనుభవమున్న డైరెక్టర్ తో పని చేస్తే ఆ హీరోకి కచ్చితంగా హిట్ వ‌స్తుందో లేదో తెలియ‌దు, అలాంటి డెబ్యూ డైరెక్టర్‌తో అదృష్టం ప‌రీక్షించుకోవాలంటే దానికి చాలా గ‌ట్స్ ఉండాలి. నాని ఇండస్ట్రీకి వచ్చి సుమారు 15 సంవత్సరాలు కావొస్తుండ‌గా, ఈ 15ఏళ్ల‌లో నాని చాలా మంది డెబ్యూ డైరెక్ట‌ర్స్‌ని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశారు. అందులో కొంత మంది ద‌ర్శ‌కుల‌తో మంచి విజ‌యాలు కూడా ద‌క్కించుకున్నాడు.

నాని నటించిన ‘అలా మొదలైంది’ మూవీ తో నందిని రెడ్డి దర్శకురాలిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన విష‌యం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో నాగ్ అశ్విన్ ని డైరెక్టర్ గా ఇంట్ర‌డ్యూస్ చేశాడు. ఇక రిజ‌ల్ట్ ప‌క్క‌న పెడితే ఈ సినిమాకి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. అనంతరం శివ నిర్వాణ అనే డెబ్యూ డైరెక్టర్ తో ‘నిన్ను కోరి’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.ఇక నిర్మాత‌గా మారిన నాని ప్రశాంత్ వర్మ అనే కొత్త దర్శకుడితో ‘అ:’ అనే డిఫరెంట్ మూవీ చేయ‌గా, ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత హిట్ సినిమాని తెర‌కెక్కించ‌గా, ఆ చిత్రంతోనే శైలేష్ కొలను వెండితెరకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు.

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిట్ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించాడు. ఈ మూవీ ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘హిట్ 2’ కూడా మంచి సక్సెస్ ని సొంతం చేసుకుంది. గత ఏడాది ‘దసరా’ సినిమాతో మొదటి పాన్ ఇండియా హిట్ సొంతం చేసుకున్న నాని ఈ చిత్రంతో శ్రీకాంత్ ఓదెలని డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. ఇక రీసెంట్‌గా వ‌చ్చిన ‘హాయ్ నాన్న’ మూవీతో మరో మరో డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్ ని టాలీవుడ్ కి పరిచయం చేశాడు . ఈ చిత్రం మంచి రెస్పాన్స్ అందుకుంది. కాక‌పోతే క‌లెక్ష‌న్స్ మాత్రం అంత‌గా వ‌స్తున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. అయితే నాని ఇలా కొత్త డైరెక్ట‌ర్స్‌తో క‌లిసి సినిమాలు చేయ‌డం గొప్ప విష‌య‌మ‌నే చెప్పాలి.

Latest News