Site icon vidhaatha

నా కొడుకు ముందే భార్య‌ని కిస్ చేస్తా.. అందులో త‌ప్పేం లేదంటున్న నాని

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు నేచుర‌ల్ స్టార్ నాని. కష్టపడి సొంతంగా ఎదిగిన నాని, త‌న కెరీర్ లో కమర్షియల్ సినిమాలతో పాటలు ప్రయోగాత్మక సినిమాలు కూడా చేసి సక్సెస్ అయ్యాడు. ఇటీవల దసరా సినిమాతో 100 కోట్ల భారీ విజయం కూడా సాధించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌పరిచాడు. ప్ర‌స్తుతం నాని 30వ సినిమాగా హాయ్ నాన్న చేస్తున్నాడు. డిసెంబ‌ర్ 7న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రం కొత్త ద‌ర్శ‌కుడు శౌర్యువ్‌ దర్శకత్వంలో తెర‌కెక్క‌గా ఇందులో మృణాల్ ఠాకూర్ క‌థానాయిక‌గా న‌టించింది.

తండ్రి కూతుళ్ళ ఎమోషన్ తో పాటు, ప్రేమ, రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఈ సినిమాలో చాలానే ఉన్న‌ట్టు మూవీ టీజ‌ర్, ట్రైల‌ర్‌ని బ‌ట్టి అర్ధ‌మైంది. అయితే గతంలో కృతిశెట్టితో శ్యామ్ సింగరాయ్ సినిమాలో లిప్ లాక్ రొమాన్స్ చేసిన నాని ఇప్పుడు మృణాల్‌తో కూడా చేసిన‌ట్టు తెలుస్తుంది. ఈ క్ర‌మంలో నానికి లిప్ లాక్‌ల గురించి ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతుంది. ఆ మ‌ధ్య ఇటీవ‌ల మీ సినిమాలలో లిప్ కిస్ లు ఉంటున్నాయి, ఎందుకు? మీరే పెట్టించుకుంటున్నారా? డైరెక్టర్స్ పెడుతున్నారా? అని అడిగారు. దానికి నాని స్పందిస్తూ.. నేను నటుడ్ని, డైరెక్టర్ అడిగినదాని బట్టే నేను చేస్తాను. అక్కడ సన్నివేశాన్ని బట్టి డైరెక్టర్ రాసుకుంటే నేనేం చేయలేను క‌దా అని అన్నారు. అయినా ఈ సీన్స్ వల్ల మా ఇంట్లో కూడా గొడవలు జరుగుతాయి. అలా అని డైరెక్టర్ చెప్పినా, కథకు అవసరం అయినా నేను చేయను అని చెప్పకూడదు కదా అని క్లారిటీ ఇచ్చాడు.

తాజాగా మరో ఇంటర్వ్యూలో లిప్‌లాక్ సీన్‌పై నాని ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు. ‘హాయ్ నాన్న మూవీకి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారు.. అంటే ఇందులో లిప్ లాక్ సీన్స్ తీసేసారా? లేక ఉండి కూడా యూ సర్టిఫికెట్ వచ్చిందా? అని అడ‌గ‌గా, దానిపై నాని స్పందిస్తూ.. లిప్ లాక్ లో తప్పేముంది. నా కొడుకు ముందే నా భార్యను కిస్ చేస్తాను. నా భార్యను ముద్దు పెట్టుకోవడం తప్పుకాదు. ఇది కూడా ప్రేమ అని వాళ్లకు ఈ ఏజ్ లోనే చెప్తున్నాం. అది తప్పు కాదు. బూతు కాదు అని అన్నారు. అది సినిమాలకు వచ్చేసరికి బూతు ఎందుకు అవుతుంది. పబ్ లోనో ఎక్కడో వ్యక్తి వేరే అమ్మాయికి ముద్దులు పెడుతూ చూపిస్తే అది ప్రాబ్లం ఏమో కాని వాడు లవ్ చేసిన అమ్మాయిని కిస్ చేయడంలో తప్పేముంది అంటూ నాని లిప్ లాక్‌ల గురించి త‌న‌దైన శైలిలో స్పందించాడు.

Exit mobile version