Site icon vidhaatha

అమెరికాలో రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ న‌వీన్ పోలిశెట్టి..డాక్ట‌ర్స్ ఏం చెప్పారంటే…!

జాతిర‌త్నాలు హీరో న‌వీన్ పోలిశెట్టి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చాలా తక్కువ సమయంలోనే తనలోని టాలెంట్‌ను నిరూపించుకుని అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సంపాదించుకున్నాడు. వ‌రుస హిట్స్‌తో దూసుకుపోతున్న న‌వీన్ అమెరికాలో రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డాడ‌ని తెలిసి ఆయ‌న అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. కొద్ది రోజుల క్రితం మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి సినిమాతో ప‌ల‌క‌రించిన న‌వీన్ పోలిశెట్టి కొద్ది రోజుల క్రితమే అమెరికాకు వెళ్లాడు. అక్కడ ఫ్రెండ్స్ అండ్ బంధువులతో ఉంటున్నట్లు తెలిసింది. అమెరికాలో బైక్‌పై వెళుతుండగా.. బైక్ స్కిడ్ అవడంతో కింద ప‌డిపోయాడ‌ని, చేతికి బ‌ల‌మైన దెబ్బ‌లు తగిలిన‌ట్టు తెలుస్తుంది. అయితే న‌వీన్‌కి త‌గిలిన దెబ్బ‌లు చిన్న‌పాటివే అయిన రెండు నెల‌ల పాటు విశ్రాంతి త‌ప్ప‌నిస‌రి అంటున్నారు.

యాక్సిడెంట్ జ‌రిగి మూడు రోజులు కాగా, రీసెంట్‌గా ఆయ‌న త‌న టీమ్‌కి తెలియ‌జేయ‌డంతో ఈ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. రెండు నుండి మూడు నెల‌ల పాటు విశ్రాంతి అంటే నవీన్ పోలిశెట్టికి గ‌ట్టిగానే దెబ్బ‌లు త‌గిలి ఉంటాయ‌ని, ఈ విష‌యం బ‌య‌ట‌కు రానివ్వ‌కుండా చేస్తున్నార‌ని కొంద‌రు అంటున్నారు. ప్రస్తుతం నవీన్ తన తర్వాతి సినిమా సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలో చేయాల్సి ఉంది. కథ కూడా సిద్ధం చేసుకున్నారట‌. అయితే త‌న‌కు కథ నచ్చినా డైరెక్టర్ నచ్చని కార‌ణంగా సినిమా వాయిదా ప‌డింద‌ని టాక్. వేరే కథ, వేరే డైరెక్టర్ ని వెతికే క్ర‌మంలో న‌వీన్ ఇలా యాక్సిడెంట్‌కి గురి కావ‌డం అంద‌రిని ఆందోళ‌న‌కి గురి చేస్తుంది. న‌వీన్ సితార సంస్థలో మాత్రమే కాకుండా.. షైన్ స్క్రీన్స్ లో కూడా నవీన్ ఒక సినిమా చేయాల్సి ఉంది

న‌వీన్ పోలిశెట్టి ఎక్క‌డ ఉంటే అక్క‌డ సంద‌డి మాములుగా ఉండదు. తన చుట్టూ ఉన్నవారిని నవ్విస్తూ ఉండటం నవీన్ స్పెషాలిటీ. అందుకే ఆయనకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. జాతిర‌త్నాలు సినిమాతోనే న‌వీన్‌కి ఫుల్ క్రేజ్ ఏర్ప‌డింది. ఆ మ‌ధ్య మ‌ల్లారెడ్డిని ఇమిటేట్ చేసి వార్త‌ల‌లోకి ఎక్కాడు. ప‌లువురిని మిమిక్రి చేస్తూ తెగ సంద‌డి చేస్తుంటాడు. అయితే ఎప్పుడు స‌ర‌ద‌గా ఉండే న‌వీల్ ఇలా యాక్సిడెంట్ బారిన ప‌డ‌డంతో ఆయ‌న అభిమానులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుతున్నారు.

Exit mobile version