ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతుంది.. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించి కొన్నాళ్లుగా షూటింగ్ కొనసాగుతోంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. రాజోలు భామ అంజలి, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, ఎస్‌జే సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్రఖని, జయరాయ్, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. గేమ్ ఛేంజర్‌కు పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.
గేమ్ ఛేంజర్ చిత్రాన్ని భారీ ఎత్తులో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే మూవీకి సంబంధించి కొన్నాళ్లుగా ఎలాంటి అప్‌డేట్ లేకపోవడం ఫ్యాన్స్‌ని ఎంతగానో కలవరపరుస్తుంది. అసలు మూవీ గత ఏడాది దీపావళికే రిలీజ్ కావల్సి ఉంది. కాని ఆగిపోయింది. కనీసం గేమ్ ఛేంజర్ నుండి ఎలాంటి అప్‌డేట్స్ లేవు. ఇప్పటివరకు మేకర్స్ కేవలం ఒక్క ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప మరే అప్ డేట్ ఇవ్వలేదు. దీంతో తీవ్ర నిరాశలో ఫ్యాన్స్ సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో నెగటివ్ ట్రెండ్ చేస్తున్నారు..గేమ్ ఛేంజర్ టీమ్ తమ బాధని అర్ధం చేసుకుని ఇకనైనా స్పందించాలని కోరుతున్నారు.
ఇటీవల దిల్ రాజు సెప్టెంబర్‌లో మూవీని విడుదల చేస్తామని తెలిపారు. సెప్టెంబర్ మొదటి వారంలోగానీ, రెండో వారంలోగానీ వస్తుందని భావించారు. అయితే చాలా వరకు సెప్టెంబర్ 27న మంచి టైమ్ అని అనుకోగా, ఈ లోపే పవన్ కళ్యాణ్ ఓజీ సెప్టెంబర్ 27న రానున్నట్టు తెలుస్తుంది. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచి డేట్ మిస్ చేసుకున్నారు.ఇక ఈ మూవీ రాదు అని, ఇక గేమ్ ఛేంజర్ లేనట్టే అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో గేమ్ ఛేంజర్ మేకర్స్ స్పందించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.