ఓణి గాలికొదిలేసి హాట్ ట్రీట్ అందించిన టిల్లుగాడి ల‌వర్.. బిత్త‌ర పోతున్న ఫ్యాన్స్

  • Publish Date - February 14, 2024 / 12:39 PM IST

త‌న క్యూట్ అందంతో పాటు న‌ట‌న‌తో ఎంతో మంది ప్రేక్షకుల మ‌న‌సులు గెలుచుకుంది అందాల ముద్దుగుమ్మ నేహా శెట్టి. “డీజే టిల్లు” సినిమాతో టాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకున్న ఈ భామ చిత్రంలో త‌న అద్భుత‌మైన ప‌ర్‌ఫార్మెన్స్‌తో అద‌ర‌హో అనిపించింది. ఇందులో త‌న అందచందాల‌తో ఆడియ‌న్స్ మ‌న‌సులు గెలుచుకుంది. నేహా శెట్టి “బెదురులంక 2012”, “రూల్స్ రంజన్” వంటి సినిమాల‌తో కూడా సంద‌డి చేసింది. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ యంగ్ హీరోయిన్ నేహా శెట్టిని తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కి ప‌రిచ‌యం చేసిన విష‌యం తెలిసిందే. మెహ‌బూబా సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ఈ భామ అక్క‌డి నుండి ఏ మాత్రం వెన‌క్కి చూసుకోకుండా సినిమాలు చేస్తుంది.

గల్లీ రౌడీ’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘డీజే టిల్లు’, ‘బెదురులంక 2012’ వంటి సినిమాలు నేహా శెట్టి చేసిన ఈ అమ్మ‌డికి మంచి క్రేజ్ తెచ్చి పెట్టిన చిత్రం డీజే టిల్లు. రాధిక పాత్ర‌లో టిల్లు గాడి ల‌వ‌ర్‌గా ఈ భామ ఎంతగానో అల‌రించింది. ఈ ఒక్క సినిమాతోనే బ్యూటీకి ఆఫర్స్ క్యూ క‌డ‌తున్నాయి. నేహా శెట్టి ఒకవైపు సినిమాల‌లో న‌టిస్తూనే మరోవైపు సోష‌ల్ మీడియాలో అందాల విధ్వంసం సృష్టిస్తుంది. ఎప్ప‌టిక‌ప్పుడు తన బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ ఫ్యాషన్ ను పరిచయం చేస్తూనే గ్లామ‌ర్ విందుతో కుర్రాళ్ల‌ని క‌ట్టిప‌డేస్తుంది నేహ‌. తాజాగా చ‌మ్కీల డ్రెస్‌లో డీప్ క్లీవేజ్ షో చేస్తూ కుర్రాళ్ల మ‌తులు పోగొడుతుంది.

గ్రీన్ కలర్ లెహంగా, మ్యాచింగ్ బ్లౌజ్ లో అందాల‌కి అడ్డుగా ఉన్న ఓణీ తీసేసి మ‌రీ ఈ బ్యూటీ చేసిన గ్లామ‌ర్ షో న‌భూతో న‌భ‌విష్య‌త్ అని చెప్పాలి .అప్పుడ‌ప్పుడు సంప్ర‌దాయ దుస్తుల‌లో సంద‌డి చేస్తూనే మ‌రోవైపు హాట్ లుక్స్‌తో కట్టి ప‌డేస్తూ ఉంటుంది. నేహా శెట్టి ఎప్పుడు ఫొటో షూట్ చేసిన ఆ పిక్స్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతూనే ఉంటాయి. ఇక ఇప్పుడు ఈ అమ్మ‌డు విశ్వక్ సేన్ తో కలిసి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రం చేస్తుంది. ఈ సినిమా నేహా శెట్టికి మంచి పేరు తీసుకొస్తుంద‌ని భావిస్తున్నారు.

Latest News