Site icon vidhaatha

సలార్ సినిమాలో కాటేర‌మ్మ ఫైట్‌లో క‌నిపించిన అమ్మాయి ఎవ‌రు?

ప్ర‌స్తుతం స‌లార్ చిత్రం థియేట‌ర్స్‌లో దుమ్ము రేపుతుంది. వ‌రుస సెల‌వుల‌తో పాటు మూవీకి మంచి టాక్ రావ‌డంతో ఈ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బీభ‌త్సం సృష్టిస్తుంది. ప్రభాస్‌ నటించిన మూవీ కావడం, ప్రశాంత్‌ నీల్‌ రూపొందించిన చిత్రం కావడం, పైగా ఆడియెన్స్ ఆదరణ పొందుతుండటం వ‌ల‌న చిత్రానికి మంచి క‌లెక్ష‌న్స్ వ‌స్తున్నాయి. మూవీ సూప‌ర్ హిట్ కావ‌డంతో ఇందులో న‌టించిన వారికి సంబంధించిన వార్త‌లు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఒక్కో పాత్ర గురించి తెలుసుకునేందుకు అభిమానులు చాలా ఆస‌క్తి చూపుతున్నారు. తాజాగా కాటేర‌మ్మ ఫైట్‌లో క‌నిపించిన అమ్మాయి ఎవ‌రని ఆరాలు తీస్తున్నారు.

సినిమాలో కాటేరమ్మ ఫైట్‌ బాగా హైలైట్ కాగా, ఇందులో విలన్ ట్రైబల్‌ ఏరియాలో ఆడపిల్లలను తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేస్తుంటారు. రోజుకు ఒకరు బలవుతుండ‌గా, ఈ క్ర‌మంలో సురభి అనే ఓ చిన్నారి త‌మ‌ని కాపాడ‌డానికి రాక్షసుడైనా వస్తాడని ఆ కాటేరమ్మని మొక్కుతుంది. ఆ సమయంలో వచ్చే ఫైట్‌ సీన్‌లో ఈ చైల్డ్ ఆర్టిస్ట్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. కాటేరమ్మ రాలేదు, ఆమె కొడుకుని పంపింది అని చెప్పే డైలాగ్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ట్రైబ‌ల్ లుక్‌లో క‌నిపించిన చిన్నారి ఉన్న కొద్ది సేపు మాత్రం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

ట్రైబల్‌ లుక్‌లో కనిపించిన అమ్మాయి గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఆ చిన్నారి మన తెలుగు అమ్మాయే కావడం విశేషం. అసలు పేరు ఫర్జానా సయ్యద్‌. ప్రస్తుతం జూ.10 చదువుతుంది. చిన్నప్పట్నుంచే యాక్టింగ్‌లో ప‌ట్టు ఉన్న ఈ చిన్నారి బాల నటిగా పలు యాడ్స్ చేసింది. మీలో ఎవరు కోటీశ్వరుడు`, ఐపీఎల్‌ యాడ్‌, అలాగే రెనాల్ట్ కారు, స్కూల్స్ ఇలా పలు యాడ్స్ చేసి పాపులారిటీ తెచ్చుకుంది. విశ్వక్‌ సేన్‌ సినిమా ఓరి దేవుడా`లో చైల్ట్ ఆర్టిస్ట్ గా చేసింది. హీరోయిన్‌కి చిన్ననాటి పాత్రలో మెరిసింది. అంజలి నటించిన `ఝాన్సీ అనే వెబ్‌ సిరీస్‌లోనూ నటించింది. స‌లార్‌లోని ఆ పాత్ర కోసం వంద‌ల‌మంది రాగా, చివ‌రికి ఈ చిన్నారిని ఫైన‌ల్ చేశార‌ట‌. ఇందుకు చాలా సంతోషంగా ఫీల‌వుతుంది సుర‌భి.

Exit mobile version