మెగా డాటర్ నిహారిక కొణిదెల ఇటీవల తెగ వార్తలలో నిలుస్తుంది. విడాకుల తర్వాత ఈ అమ్మడి పేరు తెగ మారుమ్రోగిపోతుంది. విడాకుల తర్వాత కెరీర్‌పై దృష్టి పెట్టిన ఈ అందాల ముద్దుగుమ్మ సినీ విషయాలతో పాటు పర్సనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో తన అందచందాలు ప్రదర్శిస్తూ అద్భుతమైన ఔట్ ఫిట్లలో కనిపిస్తూ.. పిచ్చెక్కిస్తుంది. నిహారిక సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలకి కొన్ని గంటల్లోనే లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లు వస్తున్నాయి.ఇక ఇటీవలే నిహారిక కొణిదెల ప్రధాన పాత్రలో డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. వెబ్ సిరీస్ డిస్పీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో నిహారిక నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ఇక నిహారిక 2020లో చైతన్యని వివాహం చేసుకోగా, పెళ్లైన కొన్ని రోజులకే విడిపోవడం పెద్ద హాట్ టాపిక్ అయింది. తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి నిహారికకు సంబంధించిన ఫొటోలను చైతన్య డిలీట్ చేయడంతో వీళ్లు విడిపోతున్నారన్న ప్రచారం జరిగింది. ఇక కొద్ది రోజులకి అటు చైతన్య, ఇటు నిహారిక కూడా తాము విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. చైతన్య నేను పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. కనుక అందరూ సంయమనంతో ఉండాలని కోరుకుంటున్నాను.. ఈ నిర్ణయంపై నాకు మద్దతుగా నిలిచిన నా కుటుంబం, స్నేహితులకు ధన్యవాదాలు. మేమిద్దరం మరో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు మాకు కాస్త ప్రైవసీ కావాలి. అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అని నిహారిక తన పోస్ట్‌లో పేర్కొంది.
ఇక విడాకుల నిహారిక చాలా జాలీగా గడుపుతుంది. ఇటీవల నిహారిక నిర్మాతగా కొత్త సినిమా ప్రారంభించింది. ఈ క్రమంలోనే నిహారిక వీపు మీద ఉన్న టాటూ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నిహారిక ఈ టాటు ఎందుకు వేయించుకుంది .. ఆ టాటూ కి అర్థం ఏంటి అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే నిహారిక వీపుపై ఉన్నటువంటి ఈ టాటూ కనక చూస్తే ఒక పక్షి లాగా అనిపిస్తుంది. ఇలా రెక్కల విప్పిన పక్షిలా ఉండడంతో దీనికి సరికొత్త అర్ధం చెపుతున్నారు. తన ఇంట్లో ఎంతో స్వేచ్చగా బ్రతికిన నిహారిక అత్తారింట్లో మాత్రం బంధించిన పక్షిలా మారిందని,విడాకుల తర్వాత మళ్లీ తిరిగి తనకి రెక్కలు వచ్చాయి అని అందుకే ఆ టాటూ వేయించుకుంది పలువురు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం నిహారిక టాటూకి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.