Site icon vidhaatha

వామ్మో.. బిగ్ బాస్ హౌజ్‌లో బూతుల ర‌చ్చ‌.. నామినేష‌న్స్ హంగామా మాములుగా లేదుగా..!

బిగ్ బాస్‌లో నామినేష‌న్ ప్ర‌క్రియ ఎంత ర‌చ్చ‌గా మారుతుందో చెప్ప‌న‌క్క‌ర్లేదు. నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటూ బిగ్ బాస్ హౌజ్ ద‌ద్ద‌రిల్లేలా చేస్తుంటారు.బిగ్‌బాస్ సీజన్-7లో 8వ వారం నామినేషన్స్ ప్రక్రియ ఓ యుద్ధం ముగిసినట్లే ఉంది. ఎందుకంటే వాళ్లు వాదించే వాదన, తిట్టుకున్న తిట్లు, వేసిన గెంతులు.. అసలు ఒక్కొక్కరూ ఒక్కో సైకోలా ప్రవర్తించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. నామినేష‌న్‌లో భాగంగా సందీప్, అమర్ దీప్, యావర్, భోలే, గౌతమ్, ప్రశాంత్.. వీరంతా రెచ్చిపోయి దారుణ‌మైన కామెంట్స్ చేశారు. సందీప్, అమర్ లాంటివారు అనకూడని మాటలు కూడా అన‌డంతో హౌజ్‌లో కాస్త గంద‌ర‌గోళ ప‌రిస్థితి ఏర్ప‌డింది.

శివాజి మాత్ర‌మే పెద్దరికంగా ఎలాంటి వాద‌న పెట్టుకోకుండా నామినేష‌న్స్ చేస్తున్నాడు.తాజా ఎపిసోడ్ లో అమర్ దీప్ ..మొదట శివాజీతో గొడవ పడ్డాడు.. ఆతరువాత బోలేతో ఘాటుగా వాదించాడు. ఇక అనంత‌రం ప్రశాంత్ నామినేట్ చేస్తూ.. గౌతమ్ తో ఆల్మోస్ట్ నువ్వా నేనా అని పొటీకి దిగాడు. ఇక ప్రశాంత్ తో అటు అమర్ దీప్ కు కూడా పెద్ద గొడవే అయ్యింది. ఈ మధ్యలో శివాజీని తీసుకువస్తూ.. మధ్య మధ్యలో ఇతర కంటెస్టెంట్స్ ను కూడా లాగి అనవసర గొడవలకు కార‌ణంగా మారాడు. ఇక యావ‌ర్ నామినేష‌న్స్ వేసే స‌మ‌యంలో సందీప్ మాస్ట‌ర్‌తో పెద్ద గొడ‌వే పెట్టుకున్నాడు. సందీప్ మాస్టర్ బొంగులే అన్న పదం వాడటంతో.. అది కాస్త పెద్ద ఇష్యూ అయ్యింది. ఇలా మాట్లాడ‌డం అంద‌రు త‌ప్పు అనే స‌రికి సందీప్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు.

ఇక నామినేష‌న్‌లో భాగంగా..సందీప్… ప్రశాంత్, భోలే, శోభా శెట్టి… యావర్, శివాజీ, భోలే… శోభా శెట్టి, గౌతమ్ లను నామినేట్ చేశాడు. యావ‌ర్‌కి, సందీప్‌కి గొడ‌వ జ‌రుగుతున్న స‌మ‌యంలో మధ్యలో బోలేకు, శోభకు వాదులాట చాలా స్ట్రాంగ్ గా జరిగింది. ఈక్రమంలో శోభా చాలా కోపంతో.. తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఇక టేస్టీ తేజ నామినేషన్స్ సిల్లీగా అనిపించడంతో.. అర్జున్ అంబాటి.. చాలా కూల్ గా ఆ విషయం చెప్పే ప్రయత్నం చేశాడు.. ఆ విషయంలో తేజాను నామినేట్ కూడా చేయ‌డం జ‌రిగింది. నామినేషన్లు కంప్లీట్ అయిన తరువాత.. బిగ్ బాస్.. కంటెస్టెంట్స్ అందరికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. మీరుమాట్లాడేటైమ్ లో.. కాస్త ఆలోచించి మాట్టాడాలి.. తప్పు పదాలు రాకుండా చూసుకుంటే మంచిది అంటూ వార్నింగ్ ఇచ్చారు.మ‌రి రానున్న నామినేష‌న్స్‌లో అయిన వీరు కంట్రోల్‌గా మాట్లాడ‌తారా అనేది చూడాలి. ఇక ఈ వారం నామినేష‌న్స్‌లో శోభా శెట్టి, భోలే షావలి, శివాజీ,అశ్విని శ్రీ,ప్రియాంక జైన్,అమర్‌ దీప్, సందీప్, గౌతమ్ ఉన్నారు.

Exit mobile version