తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు 28వ వర్ధంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా కార్యక్రమాల నిర్వాహణకి తెలుగు తమ్ముళ్లు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి ఏడాది కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు పెద్దఎత్తున జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈసారి పార్టీ నేతలు మరింత ఎక్కువగా వర్ధంతిపై దృష్టిసారించారు. మరోవైపు ఈ రోజు ఎన్టీఆర్ 28వ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ గార్డెన్‌ను పూలతో నందమూరి కుటుంబం అలంకరించింది.
తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్‌రామ్ లు తమ తాత సమాధికి నివాళులర్పించారు… ఎన్టీఆర్ రాకతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ పూర్తిగా మాస్క్‌తోనే కనిపించారు. ఇక ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. తెలుగు జాతి కీర్తిని ప్రపంచం నలుమూల చాటిన తెలుగు వెలుగు నందమూరి తారక రామరావు అని అన్నారు. ఆయన జీవితం పెద్ద పాఠ్యాంశమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జోహార్, ఎన్టీఆర్ అమర్ రహై అంటూ నినాదాలు చేశారు. నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్‌కి ఘన నివాళులు అర్పించనున్నారు.
ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు నందమూరి ఫ్యామిలీకి కాస్త దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చంద్రబాబుకి ఎన్టీఆర్ సపోర్ట్ చేయడం లేదని, ఈ క్రమంలో బాలయ్య వారిని దూరంగా పెట్టినట్టు ప్రచారాలు సాగుతున్నాయి. మరోవైపు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మధ్య కూడా విబేధాలు నెలకొన్నట్టుగా కూడా ఇటీవల పుకార్లు వచ్చాయి. డెవిల్ సినిమా గురించి జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదని.. అన్నదమ్ముల మధ్య విబేధాలు రావడం వల్లే ఆయన అలా చేశారని అన్నారు. దానికి కళ్యాణ్ రామ్ స్పందిస్తూ.. తామిద్దరి బంధానికి కొలమానం.. ఒక ట్వీటు, ఒక ఈవెంట్‌కు రావడం అని ఎవరైనా అనుకుంటే మాత్రం.. మొదట ఆ ఆలోచనను మనసులో నుంచి తీసేసుకోవాలని సూచించారు.