Site icon vidhaatha

NTR కోసం హైదరాబాదులో సముద్రాన్ని క్రియేట్ చేస్తున్న కొరటాల శివ

ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోయే చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో ఉండనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ముందు కొరటాల శివకు ఆచార్య వంటి డిజాస్టర్ ఉంది. అయినా కూడా ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ పై నమ్మకంతో ఆయనకే బాధ్యతలు అప్పగించారు.

ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మాత్రం ఇప్పటికే స్టార్ట్ అయింది. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా విశాఖ సముద్రం నేపథ్యంలో సాగుతుందని క్లారిటీ వచ్చింది. సముద్రం మాఫియా అనే నేపద్యంలో కథ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. దాంతో విశాఖ సముద్రం, దాని తీరప్రాంతాలను రీ క్రియేట్ చేస్తూ అదే వాతావరణాన్ని హైదరాబాదులో సృష్టిస్తున్నారు. ఇప్పటికే మూవీకి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సాబు సిరిల్ ఆ పనిని మొదలుపెట్టారు. తాజాగా సాబుసిరిల్ తన పుట్టినరోజు వేడుకలను ఎన్టీఆర్ 30 సెట్స్ లొకేషన్స్ లో జరుపుకున్నారు.

దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సెట్ కోసం పదుల సంఖ్యలో టెక్నికల్ టీం వర్క్ చేస్తోంది. మొత్తానికి ఆచార్య డిజాస్టర్ తరువాత కొరటాల శివ మరోసారి త‌న‌ని తాను నిరూపించుకోవాలంటే ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ గా నిల‌బెట్టాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. అలా చూసుకుంటే ఎన్టీఆర్ 30 చిత్రం కొర‌టాల‌కు డూ ఆర్ డై అనే ప‌రిస్థిని క‌ల్పించింది. లేకపోతే చిరు డైరెక్టర్ల పై చేస్తున్న కామెంట్స్ కు కొరటాల శివ సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది.

Exit mobile version