మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్‌గా తన ఇంట్లో దీపావళి వేడుక నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీతో పాటు మహేష్ బాబు, ఎన్టీఆర్, వెంకటేష్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ కూడా సతీసమేతంగా హాజరై సందడి చేశారు. క్లింకార పుట్టిన తర్వాత తొలి దీపావళి కావడంతో వేడుకని గ్రాండ్ నిర్వహించినట్టు తెలుస్తుంది. వేడుకకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పలు గిఫ్ట్స్ తీసుకొని రాగా, వాటన్నింటిలో ఎన్టీఆర్ ఇచ్చిన గిఫ్ట్ మాత్రం చాలా స్పెషల్‌గా ఉందని అంటున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ కాగా, ఇటీవల వీరిద్దరు కలిసి చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా పెద్ద విజయం సాధించింది. అయితే తన ఫ్రెండ్ కోసం ఎన్టీఆర్ అందరి కన్నా ప్రత్యేకంగా మెగా ఫ్యామిలీ దిల్ ఖుష్ అయ్యేలా.. చరణ్, ఉపాసన టెస్ట్ కు అనుగుణంగానే పలు బహుమతులు తీసుకొచ్చినట్టు సమాచారం.
విదేశాల్లో చాలా ఖరీదైన బొమ్మగా ఉండే ప్లేసెట్ ను క్లింకారకి గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీని ఖరీదు కూడా చాలా ఎక్కువగా ఉంటుందంటున్నారు. ఐదు సంవత్సరాల వయసు వచ్చేవరకు క్లింకారకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే దానిని తీసుకొచ్చినట్టు చెబుతున్నారు. సాధారణంగా ఉపాసనకి వాడి పడేసే బొమ్మలంటే పెద్దగా ఇష్టం ఉండదు. దీంతో ఉపాసన టేస్ట్ కు తగినట్లుగా, క్లింకారకు ఉపయోగపడే విధంగా తారక్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడని ఇప్పుడు నెటిజన్స్ చెప్పుకుంటున్నారు. ఇక ఈ దివాళి సెలబ్రేషన్స్ లో భాగంగా హీరోలందరూ కూడా తమ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి సందడి చేయడంతో వారి వారి అభిమానులు కూడా ఫుల్ ఖుష్ అవుతున్నారు.
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక బుచ్చిబాఉ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్నాడు. ఇది రెండు భాగాలుగా రాబోతోందని దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రం పాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతోంది. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తుండగా, చిత్రానిక అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్స్ ను నిర్మాణ సంస్థలు ఎప్పటికప్పుడు తెలియజేస్తుండగా, వచ్చే ఏడాది దేవర విడుదల చేసే ప్లాన్ చేస్తున్నారు.