సూపర్ స్టార్ రజనీకాంత్ వివాదరహితుడు. ఆయన పెద్దగా వివాదాల జోలికి వెళ్లరు. తన పనేదో తాను చూసుకుంటారు తప్ప ఎలాంటి వివాదలలోకి దూరరు. అయినప్పటికీ కొన్ని సార్లు ఏదో రకంగా వివాదాలలో ఇరికిస్తూ ఆయనపై కొందరు విమర్శలు చేస్తుంటారు. తాజాగా ఓ పెద్దావిడ రజనీకాంత్‌తో పాటు ఆయన అభిమానులపై విరుచుకుపడింది.వివరాలలోకి వెళితే సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనని కలవాలని అభిమానులు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. ప్రత్యేక సందర్భాలలో ఆయన ఇంటి ముందు బారులు తీరుతుంటారు.
పొంగల్ సందర్భంలో రజనీకాంత్ చెన్నైపోయెస్ గార్డెన్ లోని ఆయన ఇంటిముందు అభిమానుల కోలాహలం ఎక్కువగా కనిపించింది. తలైవా అంటూ నినాదాలు చేశారు. రజినీకాంత్ బయటకు వచ్చి తన అభిమానులకు అభివాదం చేయగా, అభిమాన హీరోని చూసిన ఫ్యాన్స్ మరింత రెచ్చిపోయారు. నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. ఇక ఫ్యాన్స్ సంబరంలో మునిగితేలారు. కానీ ఇదే సందర్భంలో ఒక పెద్దావిడకు చిర్రెత్తుకు రాగా, రజనీకాంత్‌తో పాటు ఆయన అభిమానులపై విరుచుకుపడింది. రజనీకాంత్ ఇంటి పక్కనే నివాసం ఉంటున్న ఒక పెద్దావిడకి వేలాదిగా వచ్చిన అభిమానులతో సమస్య ఎదురైందట. తలైవా..తలైవా అని అరుస్తూ తమని ఎంతో ఇబ్బందికి గురి చేస్తున్నారని పెద్దావిడ చెప్పుకొచ్చారు.
రజనీకాంత్‌కి అభిమానులపై అంత ఇష్టం ఉంటే వారిని ఇంట్లో పిలిపించుకోవాలి కాని పక్కన ఉన్న మమ్మల్ని ఇంత ఇబ్బందికి గురి చేయడం తగదు. మేము కూడా ఇంటి పన్ను కడుతున్నాం. పండగ పూట ప్రశాంతత లేకుండా ఈ గోల ఏంటి… అంటూ ఆ మహిళ మండిపడింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. రజనీకాంత్ తప్పు ఇందులో ఎంత మాత్రం లేకపోయిన అభిమానులు చేసిన రచ్చకి ఆ పెద్దావిడతో తలైవా మాటలు పడాల్సి వచ్చింది.ఇక రజనీకాంత్ సినిమాల విషయానికి వస్తే.. గత ఏడాది జైలర్ రూపంలో భారీ విజయం నమోదు చేశాడు. నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ చిత్రానికి దర్శకత్వం వహించారు. రజనీకాంత్ లాల్ సలామ్ లోని రెండవపాటతో పాటు.. వేట్టైయాన్ మూవీ ఫస్ట్ లుక్ కూడా పొంగల్ సందర్భంగా విడుదల అయిన విషయం తెలిసిందే.