ఆస్కార్..ఈ పేరు వింటేనే కళాకారులు పులకించిపోతారు. ఈ అవార్డ్ అందుకోవాలని తహతహలాడుతుంటారు. జీవితంలో ఒక్కసారైన ఆస్కార్ అందుకోవాలనేది వారి కల. చాలా మంది స్టార్ హీరోలు కూడా ఇప్పటి వరకు ఆస్కార్ దక్కించుకోలేదు. అయితే రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ చిత్రంకి పని చేసిన సంగీత దర్శకుడు కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్‌లకి ఆస్కార్ దక్కడంతో తెలుగు గడ్డ మురిసిపోయింది.ఎన్నో ఏళ్ల నుండి ఆస్కార్ కోసం ఎదురు చూస్తున్న టాలీవుడ్‌కి సరికొత్త ప్రాణం పోసినట్టు అయింది. అయితే ఈ ఏడాది మార్చి 10న లాస్ ఏంజెల్స్‌లో జరిగే కార్యక్రమంలో 96వ అకాడమీ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
2024 ఆస్కార్ అవార్డులకు సంబంధించి నామినేషన్స్‌ను అకాడమీ ప్రకటించింది. గత 12 నెలల నుంచి చిత్ర పరిశ్రమలోని అత్యుత్తమ నటీనటులు, సినిమాలను ఆస్కార్ కమిటీ గౌరవించనుండగా, నామినేషన్స్ లో ఏఏ సినిమాలు స్థానం దక్కించుకున్నాయో చూద్దాం. ముందుగా ఉత్తమ చిత్రం విషయానికి వస్తే.. అమెరికన్ ఫిక్షన్, అనాటమీ ఆఫ్ ఏ ఫాల్, బార్బీ, ది హోల్డ్ ఓవర్స్,కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ ,మూన్, మాస్ట్రో, ఓపెన్ హైమర్, పాస్ట్ లివ్స్, పూర్ థింగ్స్, ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్ చిత్రాలు నిలిచాయి. ఇక బెస్ట్ డైరెక్షన్.. చూస్తే.. జస్టిన్ ట్రయిట్ – అనాటమీ ఆఫ్ ఏ ఫాల్, మార్టిన్ స్కోర్సెస్ – కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ , మూన్, క్రిస్టోఫర్ నోలన్ – ఓపెన్ హైమర్, యొర్గోస్ లాంతిమోస్ – పూర్ థింగ్స్, జోనాథన్ గ్లేజర్ – ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్ ఉన్నారు.
ఇక బెస్ట్ యాక్టర్ (లీడింగ్ రోల్).. బ్రాడ్లీ కూపర్ – మాస్ట్రో, కోల్‌మాన్ డొమింగో – రస్టిన్,,పాల్ గిమ్మట్టి – దిహోల్డ్ ఓవర్స్,సిలియాన్ మర్ఫి – ఓపెన్ హైమర్,,జెఫ్రీ రైట్ – అమెరికన్ ఫిక్షన్, ఇక బెస్ట్ యాక్ట్రెస్ (లీడింగ్ రోల్).. అన్నట్టే బేనింగ్ – న్యడ్, లిలీ గ్లాడ్ స్టోన్ – కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, సండ్ర హుల్లెర్ – అనాటమీ ఆఫ్ ఏ ఫాల్, కరే ముల్లిగాన్ – మాస్ట్రో, ఎమ్మా స్టోన్ – పూర్ థింగ్స్ ఉన్నారు. బెస్ట్ యాక్టర్ (సపోర్టింగ్ రోల్).. .స్టెర్లింగ్ కె బ్రౌన్ – అమెరికన్ ఫిక్షన్,రాబర్ట్ డే నీరో – కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్,రాబర్ట్ డౌనీ జూనియర్ – ఓపెన్ హైమర్, ర్యాన్ గోస్లింగ్ – బార్బీ, మార్క్ రాఫ్ఫాలో – పూర్ థింగ్స్, బెస్ట్ యాక్ట్రెస్ (సపోర్టింగ్ రోల్).. ఎమిలీ బ్లుంట్ – ఓపెన్ హైమర్ ,దానియెల్లీ బ్రూక్స్ – ది కలర్ పర్‌పుల్, అమెరికా ఫెర్రెర – బార్బీ, జోడీ ఫాస్టర్ – న్యడ్, డవైన్ జాయ్ రాండోల్ఫ్ – ది హోల్డ్ ఓవర్స్, ఇక బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం.. హి బాయ్ అండ్ ది హీరోన్,ఎలెమెంటల్, నిమోనా, రోబోట్ డ్రీమ్స్, స్పైడర్-మాన్: అక్రోస్ ది స్పైడర్-వర్స్ నిలిచాయి.
బెస్ట్ సినిమాటోగ్రఫీ..
ఎల్ కండె
కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
మాస్ట్రో
ఓపెన్ హైమర్
పూర్ థింగ్స్
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్..
జాక్వెలిన్ దుర్రన్ – బార్బీ
జాక్వెలిన్ వెస్ట్ – కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
జాంటీ యెట్స్, డేవ్ క్రాస్ మాన్ – నెపోలియన్
ఎల్లెన్ మీరోజెనిక్ – ఓపెన్ హైమర్
హాలీ వడ్డింగ్టన్ – పూర్ థింగ్స్
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం..
బాబీ వైన్ : ది పీపుల్స్ ప్రెసిడెంట్
ది ఎటర్నల్ మెమరీ
ఫోర్ డాటర్స్
టు కిల్ ఏ టైగర్
20 డేస్ ఇన్ మరియుపూల్
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం..
ది ఏబిసిస్ ఆఫ్ బుక్ బన్నింగ్
ది బార్బర్ ఆఫ్ లిటిల్ రాక్
ఐలాండ్ ఇన్ బిట్వీన్
ది లాస్ట్ రిపేర్ షాప్
నాయి నాయి & వై పో
బెస్ట్ ఫిలిం ఎడిటింగ్..
అనాటమీ ఆఫ్ ఏ ఫాల్
ది హోల్డ్ ఓవర్స్
కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
ఓపెన్ హైమర్
పూర్ థింగ్స్
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం..
ఇఓ క్యాపిటనో
పర్ఫెక్ట్ డేస్
సొసైటీ ఆఫ్ ది స్నో
ది టీచర్స్ లాంజ్
ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్
బెస్ట్ మ్యూజిక్ (ఒరిజినల్ స్కోర్)..
లారా కఱ్పమాన్ – అమెరికన్ ఫిక్షన్
జాన్ విల్లియమ్స్ – ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ
రాబి రోబెర్ట్సన్ – కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
లుద్విగ్ గొరస్న్ – ఓపెన్ హైమర్
జెర్స్కిన్ ఫెన్డ్రిక్ – పూర్ థింగ్స్
బెస్ట్ మ్యూజిక్ (ఒరిజినల్ సాంగ్)..
The Fire Inside
I’m Just Ken
It Never Went Away
Wahzhazhe
What Was I Made For?
బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం..
లెటర్ టు ఏ పిగ్
నైంటీ-ఫైవ్ సెన్సెస్
ఔర్ యూనిఫామ్
పచైడెర్మ్
వార్ ఈజ్ ఓవర్
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం..
ది ఆఫ్టర్
ఇన్విన్సిబుల్
నైట్ ఆఫ్ ఫార్చ్యూన్
రెడ్, వైట్ అండ్ బ్లూ
ది వండర్ ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్
బెస్ట్ సౌండ్..
ది క్రియేటర్
మాస్ట్రో
మిషన్ ఇంపాసిబుల్ 7 పార్ట్ 1
ఓపెన్ హైమర్
ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్
బెస్ట్ విజువక్ ఎఫెక్ట్స్..
ది క్రియేటర్
గాడ్జిల్లా మైనస్ వన్
గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ వాల్యూం 3
మిషన్ ఇంపాసిబుల్ 7 పార్ట్ 1
నెపోలియన్
బెస్ట్ రైటింగ్ (అడాప్టెడ్ స్క్రీన్ ప్లే)..
అమెరికన్ ఫిక్షన్
బార్బీ
ఓపెన్ హైమర్
పూర్ థింగ్స్
ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్
బెస్ట్ రైటింగ్ (ఒరిజినల్ స్క్రీన్ ప్లే)..
అనాటమీ ఆఫ్ ఏ ఫాల్
ది హోల్డ్ ఓవర్స్
మాస్ట్రో
మే డిసెంబర్
పాస్ట్ లివ్స్
ఇండియా నుంచి ఆస్కార్ నామినేషన్స్ కి అధికారికంగా వెళ్లిన మలయాళ మూవీ ఈ నామినేషన్స్ లో స్థానం దక్కించుకోలేకపోవడం గమనర్హం.