ఈ వారం ఓటీటీలో సంద‌డే సంద‌డి..ప్రేక్షకుల‌ని అల‌రించ‌బోతున్న రెండు డ‌జ‌న్ల సినిమాలు

  • Publish Date - March 13, 2024 / 10:40 AM IST

ప్ర‌తి వారం ఓటీటీలో ఫ్యాన్స్‌కి కావ‌ల్సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్ ద‌క్కుతుంది. ఒక‌వైపు థియేట‌ర్‌లో సినిమాలు సంద‌డి చేస్తూనే ఉన్నా ఓటీటీలో కూడా మంచి కంటెంట్ ప్ర‌సారం అవుతుంది. ఈ శుక్ర‌వారం వెండితెర‌పై చిన్న సినిమాల సంద‌డే ఉంది. ‘రజాకార్’, ‘వెయ్ దరువెయ్’, ‘తంత్ర’ సినిమాలతో పాటు ‘యోధ’ అనే డబ్బింగ్ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. అయితే ఓటీటీలో మాత్రం మంచి చిత్రాలతో పాటు వెబ్ సిరీస్‌లు ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధంగా ఉన్నాయి. నెట్‌ ఫ్లిక్స్ లో చూస్తే యంగ్ రాయల్స్ సీజన్ 3 (స్వీడిష్ సిరీస్) – మార్చి 11 నుండి స్ట్రీమ్ అవుతుంది. ఇక టర్నింగ్ పాయింట్ (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 12న విడుద‌ల కాగా, బండిడోష్ (స్పానిష్ సిరీస్) – మార్చి 13 నుండి స్ట్రీమ్ కానుంది.

ఇక 24 హవర్స్ విత్ గాస్పర్ (ఇంగ్లీష్ సినిమా) – మార్చి 14న, గర్ల్స్ 5 ఎవా: సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 14, చికెన్ నగ్గెట్ (కొరియన్ సిరీస్) – మార్చి 15, ఐరిష్ విష్ (ఇంగ్లీష్ మూవీ) – మార్చి 15, ఐరన్ రియన్ (స్పానిష్ సిరీస్) – మార్చి 15, మర్డర్ ముబారక్ (హిందీ సినిమా) – మార్చి 15నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది.ఇక అమెజాన్ ప్రైమ్ లో చూస్తే.. లవ్ అదురా (హిందీ సిరీస్) – మార్చి 13 నుండి స్ట్రీమ్ కానుండ‌గా, బిగ్ గర్ల్స్ డోంట్ క్రై (హిందీ సిరీస్) – మార్చి 14,ఇన్విన్సబుల్ సీజన్ 2 పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 14, ఫ్రిడా (ఇంగ్లీష్ మూవీ) – మార్చి 15 నుండి స్ట్రీమ్ కానుంది.

హాట్‌ స్టార్ లో చూస్తే.. గ్రేస్ అనాటమీ: సీజన్ 20 (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 15నుండి, సేవ్ ద టైగర్స్ సీజన్ 2 (తెలుగు సిరీస్) – మార్చి 15 నుండి, టేలర్ స్విఫ్ట్: ద ఎరాస్ టూర్ (ఇంగ్లీష్ మూవీ) – మార్చి 15 నుండి స్ట్రీమ్ కానున్నాయి. ఇక జీ5లో చూస్తే.. మెయిన్ అటల్ హూ (హిందీ సినిమా) – మార్చి 14 నుండి స్ట్రీమ్ కానుంది. సోనీ లివ్ లో భ్రమయుగం (తెలుగు డబ్బింగ్ మూవీ) – మార్చి 15 నుండి స్ట్రీమింగ్ కానుంది. జియో సినిమాలో హనుమాన్ (హిందీ వెర్షన్ మూవీ) – మార్చి 16 నుండి స్ట్రీమ్ కానుంది. ట్రాల్స్ బ్యాండ్ టుగెదర్ (ఇంగ్లీష్ మూవీ) – మార్చి 17 నుండి స్ట్రీమ్ కానుంది.

Latest News