Site icon vidhaatha

ఈ వారం ఓటీటీ ప్రియుల‌కి కావ‌ల్సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్.. థియేట‌ర్స్‌లోను సంద‌డి మాములుగా ఉండ‌దు..!

ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా అటు థియేట‌ర్‌లో ఇటు ఓటీటీలో ప్రేక్ష‌కుల‌కి కావ‌ల్సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందుతుంది. థియేట‌ర్స్‌లో రిలీజ్ అయ్యే సినిమాలు చూస్తే ఈ వారం అంటే మార్చి 8వ తేదీ రోజు గోపీచంద్ హీరోగా చేసిన భీమా సినిమా రాబోతుంది. ఇక‌ విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించబోతున్న గామి సినిమా కూడా 8వ తేదీన థియేట‌ర్స్‌లో రిలీజ్ కానుంది. వాటితో పాటు మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ప్రేమలు కూడా ఈ శుక్రావ‌రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.ఈ సినిమాల‌కి పోటీగా నిహార్, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్ లు ప్రధాన పాత్రలో రూపొందిన‌ రికార్డు బ్రేక్ సినిమా కూడా శుక్ర‌వారం సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైంది.

నవ్వించే బాయ్స్ అనే చిత్రం కూడా 8వ తేదీన వస్తుండగా.. నాయుడు గారి అబ్బాయి ప్రేమలో రాజుగారి అమ్మాయి మార్చి 9న‌, శైతాన్ అనే హిందీ సినిమా మార్చి 8న థియేట‌ర్స్‌లో విడుద‌లై సంద‌డి చేయ‌నున్నాయి. ఇక ఓటీటీలో చూస్తే.. ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ లో అన్వేషిప్పిన్‌ కండెతుమ్‌ (తెలుగులోనూ): మార్చి 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ది జెంటిల్‌మ్యాన్‌ (హాలీవుడ్‌): మార్చి 7 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుండ‌గా, డ్యామ్‌సెల్‌ (హాలీవుడ్‌): మార్చి 8 వ తేదీ నుంచి , ది బ్యాక్‌-అప్‌ ప్లాన్‌ (హాలీవుడ్‌): మార్చి 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. లాల్ సలాం-నెట్ ఫ్లిక్స్- మార్చి8 నుండి, మెర్రీ క్రిస్మస్- మార్చి 9 నుండి స్ట్రీమింగ్ కానుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో చూస్తే సాగు (తెలుగు): మార్చి 4 నుండి స్ట్రీమ్ అవుతుంది (ఎంఎక్స్‌ ప్లేయర్‌లోనూ స్ట్రీమింగ్ అవుతుంది), కెప్టెన్‌ మిల్లర్‌ (హిందీ): మార్చి 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. యాత్ర 2- మార్చి 8 నుండి స్ట్రీమింగ్ కానుంది.డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేధికగా..: షో టైమ్ (హాలీవుడ్) – మార్చి 8 నుండి స్ట్రీమ్ కానుంది. జీ5 లో చూస్తే.. హనుమాన్ (తెలుగు) – మార్చి 8 నుండి స్ట్రీమింగ్ కానుండ‌గా, ఊరుపేరు భైరవకోన – మార్చి 8 నుండి స్ట్రీమ్ కానున్న‌ట్టు స‌మాచారం. సోనీలివ్ వేధికగా…: మహారాణి (హిందీ వెబ్ సిరీస్ ) – మార్చి 7 నుండి స్ట్రీమ్ కానుండ‌గా, ఈటీవీ విన్ లో వళరి (తెలుగు వెబ్ సిరీస్) – మార్చి 6 నుండి స్ట్రీమ్ అవుతుంది.

Exit mobile version