Site icon vidhaatha

బిగ్ బాస్ చ‌రిత్ర‌లో ఇది తొలిసారి.. సామాన్యుడికి ప‌ట్టం క‌ట్టిన ప్రేక్ష‌కులు

కింగ్ నాగార్జున హోస్ట్ గా మొద‌లైన బిగ్ బాస్ సీజన్ 7 ఎట్ట‌కేల‌కి ముగిసింది. 105 రోజుల పాటు బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్ టాప్ 5లో నిలిచి అంద‌రి ప్రేక్ష‌కాభిమానాలు గెలుచుకున్నారు.ఫినాలే ఎంతో సంద‌డిగా సాగ‌గా, టైటిల్ కోసం అర్జున్, ప్రశాంత్, శివాజీ, ప్రిన్స్ యావర్, అమర్ దీప్, ప్రియాంక పోటీ పడ్డారు. వీరిలో అదృష్టం ప‌ల్లవి ప్ర‌శాంత్‌ని వ‌రించి అత‌డిని విజేత‌గా నిలిచేలా చేసింది. సామాన్యుడిగా బిగ్ బాస్ హౌజ్‌లోకి వ‌చ్చిన ప్ర‌శాంత్ ఇప్పుడు పెద్ద సెల‌బ్రిటీగా మారాడు. హౌజ్‌లో తనదైన ఆటతీరు, మాటతీరుతో అందరి మనసులు గెల్చుకున్న ప్ర‌శాంత్ క‌ప్ కూడా గెలుచుకున్నాడు. రతికా రోజ్‌ లాంటి కంటెస్టెంట్స్‌ ప్రేమ పేరుతో తనను ఇబ్బంది పెట్టినా కూడా ఎక్క‌డా కూడా వారిని ఇబ్బంది పెట్టే ప్ర‌య‌త్నం చేశాడు.

త‌న‌ని త‌క్కువ‌గా చూసిన వాళ్ల‌కి గట్టిగానే బదులిచ్చాడు ప్ర‌శాంత్. బిగ్ బాస్ విన్న‌ర్ కి 35 ల‌క్ష‌ల‌ ప్రైజ్ మనీతో పాటు మారుతి బ్లేజర్ కారు, 15 లక్షలు విలువ చేసే జోయాలుక్కాస్ బంగారు ఆభరణాలు బ‌హుమ‌తిగా అందించారు.శివాజి, అమ‌ర్ దీప్, అర్జున్ , ప్రియాంక వంటి పాపుల‌ర్ సెల‌బ్రిటీలని దాటి ప్ర‌శాంత్ ఇక్క‌డ వ‌ర‌కు వ‌చ్చాడంటే నిజంగా చాలా గ్రేట్. ర‌తిక‌తో మొద‌ట్లో కాస్త రొమాంటిక్‌గా ఉన్నా త‌ర్వాత ఆమెని అక్క అని పిలిచిన కూడా ప్ర‌శాంత్‌కి నెగెటివిటీ రాలేదు. ఎక్క‌డిక‌క్క‌డ జాగ్ర‌త్త‌గా ఉంటూ త‌న టాస్క్‌లలో నూటికి నూరు శాతం ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తూ విజేత‌గా నిలిచాడు.

రైతు బిడ్డగా తనలాంటి యువకులకు, రైతులకు ఆదర్శంగా నిల‌వాల‌నే బిగ్ బాస్‌కి వ‌చ్చాన‌ని చెప్పిన ప్ర‌శాంత్ ఇప్పుడు త‌నకు వ‌చ్చిన ప్రైజ్ మ‌నీని రైతుల కోస‌మే ఖ‌ర్చు పెడ‌తాన‌ని చెప్పుకొచ్చాడు. అయితే ప్ర‌శాంత్‌కి పెళ్లైందని, కోట్ల ఆస్తులున్నాయని కొన్ని పీఆర్‌ టీమ్స్‌ నెగెటివ్‌ ప్రచారం చేసినా అవేమి కూడా త‌న విజ‌యాన్ని అడ్డుకోలేకపోయాయి.ఇక ఈ సీజ‌న్‌లో టాప్ 6 గా అర్జున్ బ‌య‌ట‌కి రాగా, టాప్ 5 ప్రియాంక‌, టాప్ 4 యావ‌ర్‌15 ల‌క్ష‌ల సూట్ కేసు తీసుకొని బ‌య‌ట‌కు వచ్చాడు. ఇక టాప్ 3గా శివాజీ, టాప్ 2గా అమ‌ర్ దీప్ నిలిచారు. శివాజీ విన్న‌ర్ కాలేక‌పోయినందుకు ఆయ‌న కుమారుడు తెగ ఏడ్చేశాడు. అలానే అమ‌ర్‌దీప్ ఓట‌మి త‌ర్వాత ఆయ‌న భార్య కూడా చాలా ఎమోష‌న‌ల్ అయింది.

Exit mobile version