అందులో నిఖత్ జరీన్, ధీరజ్.. ఇద్దరు తెలుగు రాష్ట్రాల నుంచి
న్యూఢిల్లీ : పారిస్ ఒలింపిక్స్ -2024కు సమయం సమీపిస్తున్నది. జూలై 26 నుంచి ఆగస్ట్ 11 మధ్య జరిగే ఈ విశ్వక్రీడా సంగ్రామానికి భారతదేశం నుంచి వివిధ క్యాటగిరీల్లో ఇప్పటికే కొంతమందిని ఎంపిక చేశారు. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు కూడా ఉన్నారు.
2020 టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియా తరఫున ప్రాతినిథ్యం వహించిన 124 మంది రికార్డు స్థాయిలో ఏడు పతకాలు గెలుచుకున్నారు. అందులో పురుషుల జావెలిన్ త్రో లో నీరజ్ చోప్రా సాధించిన పసిడి పతకం కూడా ఉన్నది. ఏదేని ఒలింపిక్స్‌లో భారతదేశానికి ఇన్ని పతకాలు రావడం అదే మొదటిసారి. ఈసారి భారతదేశం నుంచి మరింతమంది మరిన్ని పతకాలు సాధించాలన్న కలలతో బయలుదేరనున్నారు.
ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు దేశాలకు కోటా ఉంటుంది. కొందరు వారి ప్రతిభ ఆధారంగా లేదా వరల్డ్ ర్యాంకింగ్స్ ప్రాతిపదికన కూడా నేరుగా ఎంపిక అర్హత సాధిస్తుంటారు. ప్రతి దేశానికి జాతీయ ఒలింపిక్ కమిటీ (ఎన్‌వోసీ) ప్రత్యేక అథారిటీగా ఉంటుంది. ఎన్‌వోసీ ఎంపిక చేసినవారే ఒలింపిక్స్‌లో పాల్గొంటారు. భారత కోటాలో పారిస్ ఒలింపిక్స్‌కు ట్రాప్ షూటర్ భౌనీశ్ మెందిరట్ట చోటు సాధించగా, ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో రేస్‌వాకర్స్ ప్రియాంక గోస్వామి, అక్షదీప్ సింగ్ ఎంపికయ్యారు. టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.
ఇప్పటి వరకూ ఎంపికయ్యింది వీరే..
షూటింగ్:
పురుషుల ట్రాప్ : భౌనీశ్ మెందిరట్ట
మహిళల ట్రాప్ : రాజేశ్వరి కుమారి
పురుషుల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ : రుద్రాంక్ష్ పాటిల్, అర్జున్ బబుతా
మహిళల పది మీటర్ల ఎయిర్ రైఫలిల్ : మెహూలి ఘోష్, తిలోత్తమ సేన్
పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్: స్వాప్నిల్ కుశాలే, అఖిల్ షెరాన్
మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్: సిఫ్త్ కౌర్ సమ్రా, శ్రీయాంక సదంగి
పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ : సరబ్‌జోత్‌సింగ్, వరుణ్ తోమర్,
మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ : ఈషాసింగ్
మహిళల 25 మీటర్ల పిస్టల్ : మను భాకెర్
పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ : అనీశ్ భన్వాలా
ఆర్చరీ
పురుషుల రీకర్వ్ : ధీరజ్ బొమ్మదేవర
రెజ్లింగ్
మహిళల 53 కేజీల విభాగం : అంతిమ్ పన్‌ఘల్
బాక్సింగ్ :
మహిళల 50 కేజీల విభాగం : నిఖత్ జరీన్
మహిళల 54 కేజీల విభాగం : ప్రీతి పవార్
మహిళల 57 కేజీల విభాగం : పర్వీనా హుడా
మహిళల 75 కేజీల విభాగం : లవ్వీనా బోర్గోహైన్
అథ్లెటిక్స్
మహిళల 20 కిలోమీటర్ల రేస్‌వాక్ : ప్రియాంక గోస్వామి
పురుషుల 20 కిలోమీటర్ల రేస్‌వాక్ : వికాస్ సింగ్
పురుషుల 20 కిలోమీటర్ల రేస్‌వాక్ : పరమ్‌జీత్ బిష్త్
పురుషుల 20 కిలోమీటర్ల రేస్‌వాక్ : అక్షదీప్ సింగ్
పురుషుల లాంగ్ జంప్ : మురళీ శ్రీశంకర్
పురుషుల 3వేల మీటర్ల స్టీపిల్‌చేజ్ : అవినాశ్ సబ్లే
పురుషుల 3వేల మీటర్ల స్టీపిల్‌చేజ్ : పారుల్ చౌదరి
పురుషుల జావెలిన్ త్రో : నీరజ్ చోప్రా, కిశోర్ జెనా
పారిస్ ఒలింపిక్స్ ఇప్పటి వరకూ ఎంపికైనవారిలో నిఖత్ జరీన్ తెలంగాణ అమ్మాయి. ఆర్చరీలో ఎంపికైన ధీరజ్ బొమ్మదేవర ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరానికి చెందిన క్రీడాకారుడు. పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత క్రీడాకారుల తుది జాబితాను జూన్‌లో ప్రకటిస్తారు.