Site icon vidhaatha

జ‌న‌సేనానికి అనారోగ్యం అంటూ వార్త‌లు.. ఇంత‌లోనే అర్ధ‌రాత్రి పూజ‌లు..!

ప‌వ‌ర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక‌వైపు సినిమాల‌తో స‌త్తా చాటుతూనే మ‌రోవైపు రాజ‌కీయాల‌లో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు.గ‌త కొద్ది రోజులుగా ప‌వ‌న్ సినిమాల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. కేవ‌లం రాజ‌కీయాలు మాత్ర‌మే చేస్తున్నారు. ఆయ‌న క‌మిటైన ఓజీ, ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌,హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఇంకా ఐదు నెలలు ఆ సినిమా షూటింగ్‌లు ఆగిపోనున్నాయి. అయితే రీసెంట్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనారోగ్యం బారిన ప‌డ్డార‌ని, ప్ర‌స్తుతం ఇంటికే ప‌రిమితం అయ్యార‌ని రీసెంట్‌గా ప్రచారం జ‌రిగింది.క‌ట్ చేస్తే ప‌వ‌న్ క‌ళ్యాణ్ అర్ధ‌రాత్రి త‌న ఫామ్ హౌజ్‌లో సైలెంట్‌గా పూజలు నిర్వ‌హించాడ‌ని వార్తలు వ‌స్తున్నాయి.

ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో తీరిక లేకుండా తిరగడం వల్ల ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఆరోగ్యం అస్సలు బాగుండడం లేదట. తరచూ అనారోగ్యానికి గురవుతుండ‌డం, ఎంతమంది డాక్టర్లకు చూపించినా కూడా అనారోగ్యానికి గురవుతుండ‌డంతో శుక్ర‌వారం అర్ధ‌రాత్రి తన ఫామ్‌ హౌజ్‌లో పూజలు నిర్వహించిర‌న‌ట్టు స‌మాచారం. జాతకంలో దోషం ఉండడం వల్లే ఇలా జరుగుతుందని ఒక‌ జ్యోతిష్యుడు చెప్పడంతో తన ఫామ్ హౌస్‌లో పవన్ కళ్యాణ్ పూజలు చేశాడ‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. దీనిపై పూర్తి క్లారిటీ రావ‌ల‌సి ఉంది. ప‌వ‌న్ సాధార‌ణంగా రెగ్యుల‌ర్ ఎక్స‌ర్‌సైజ్‌లు, బాడీని ఫిట్‌గా ఉంచుకోవడం, యోగా వంటివి చేస్తుంటూ హెల్త్ విషయంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఉంటాడు.

అర్ధరాత్రి పవన్‌ పూజలు చేసిన‌ట్టు వ‌చ్చిన వార్త‌ల‌లో నిజ‌మెంత‌? ఇవన్నీ ఉట్టి పుకార్లేనా? అనేది తెలియాల్సి ఉంది. యువ‌గ‌ళం ముగింపు స‌భ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనారోగ్యం బారిన ప‌డిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. దాంతో అభిమానులు చాలా ఆందోళ‌న చెందారు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల విష‌యానికి వ‌స్తే ఆయ‌న చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఆగిపోయింది. ఈ మూవీ ఉంటుందా? అనేది కూడా డౌటే. ఇక సుజీత్‌` రూపొందించే ఓజీ సగానికిపైగానే షూటింగ్ పూర్తి కాగా, ఒక పదిహేను రోజులు పవన్‌డేట్స్ ఇస్తే, మొదటిపార్ట్ పూర్తవుతుంది. అలాగే ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ఒకటి రెండో షెడ్యూల్‌ అయ్యింది. ఈ మూవీ షూటింగ్‌కి మ‌రింత టైమ్ ప‌ట్టేలా ఉంది.

Exit mobile version