ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి అతి పెద్ద విజయం సాధించిన చిత్రం సలార్. ఈ సినిమాతో ప్రభాస్ మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. వరుస ప్లాపుల్లో ఉన్న ప్రభాస్ కి ఈ మూవీ కొంత రిలీఫ్ ఇచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ ను చూసి ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చాయి అంటే.. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏ రేంజ్లో ఎలివేషన్ ఇచ్చాడో అర్ధం చేసుకోవచ్చు. మొదటి పార్ట్ ఇచ్చిన ఎలివేషన్స్ కి సెకండ్ పార్ట్ పై అంచనాలు ఓ రేంజ్‌లో పెరిగాయి. అయితే సెకండ్ హాఫ్ లో వచ్చే కాటేరమ్మ ఫైట్ సమయంలో విలన్ పక్కన ఉండే ఆంటీ అందరికీ గుర్తుండే ఉంటుంది.
రెండు నిమిషాలు బావా దొరసానిలా తయారుచేస్తాను అనే డైలాగ్‌తో ఆమె హైలైట్ అయింది. ఇక క్లైమాక్స్ లో ప్రభాస్ ఆమెకు కౌంటర్ ఇస్తూ.. ‘రెండు నిమిషాలు దొరలా తయారుచేస్తా’ అని డైలాగ్ పేల్చుతాడు. ఆ సమయంలో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ అదుర్స్ . ఇంతకు ఆమె పేరు ఏంటంటే పూజ విశ్వేశ్వర్ .తెలుగు నటి అయిన ఈమె సలార్ కి ముందు చాలా సినిమాలు చేసింది. కాని సలార్‌తో పేరు మారుమ్రోగిపోయింది. తాజాగా పూజా విశ్వేశ్వర్ ముఖంనిండా గాయాలతో కనిపించడం అందరిని షాక్ కు గురి చేస్తోంది. అయితే ఈమె యాక్సిడెంట్ అయ్యిందని అంటున్నారు.
విశాఖపట్నంలోని అనకాపల్లి హైవే మీద ప్రయాణిస్తుండగా పొరపాటున ఒక డివైడర్‌ను ఢీకొట్టింది. డివైడర్‌ను ఢీకొట్టడంతో కిందపడిన పూజా విశ్వేశ్వర్ ముఖానికి గాయాలయ్యాయి. ఆమె కంటి భాగం దగ్గర కూడా చిన్నపాటి ఇంజ్యురీ అయింది. ఆమె హాస్పిటల్ బెడ్ మీద ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇక, మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’, మాస్ మహారాజా రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాల్లో పూజ యాక్ట్ చేశారు. వైవా హర్ష కొత్త సినిమా ‘సుందరం మాస్టర్’తో పాటు ‘దక్షిణ’ అనే మరో మూవీలోనూ ఆమె నటిస్తున్నారు. సలార్‌తో మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలో ఆమెకి ఇలా ప్రమాదం అయిందని తెలిసి అందరు షాక్ అవుతున్నారు. త్వరగా కోలుకొని స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్‌తో పాటు పరిశ్రమ వర్గాలు కూడా కోరుకుంటున్నాయి.